Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జమ్మూ » వాతావరణం

జమ్మూ వాతావరణం

అనుకూల సమయంజమ్మూ పర్యాటకులు అక్టోబర్ నుండి మార్చ్ వరకు ప్రణాళిక చేయవచ్చు. ఆ సమయం లో ఈ ప్రాంతం ఆహ్లాదంగా వుండి ప్రాంత అందాలు చక్కగా చూడవచ్చు.

వేసవి

జమ్మూ సంవత్సరం పొడవునా ఉప ఉష్ణమండల వాతావరణం కలిగి వుంటుంది. ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. శీతాకాలాలు పూర్తిగా మంచు తో నిండి గడ్డ కట్టి వుంటుంది.వేసవి (ఏప్రిల్ నుండి మే వరకు) . వేసవి లో ఉష్ణోగ్రత గరిష్టం 45 డిగ్రీలు వుండి చాలా వేడి గా వుండి పర్యాటకులకు అసౌకర్యం గా వుంటుంది. కనుక పర్యటన సూచించ దగినది కాదు అయితే ఒక సారి వర్షాలు పడితే చాలు ప్రాంతం పూర్తిగా చల్ల పడుతుంది

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్ మధ్య వరకు) వర్షాకాలం జూన్ లో మొదలవుతుంది సగటున 1246 ఎం ఎం వర్షపాతం రికార్డు అవుతుంది ఈ సమయం లో హుమిడిటి స్థాయి 70 శాతం గా వుంటుంది. లోయ పూర్తిగా దట్టమైన పొగ మంచు ఆవరించి వుంటుంది.

చలికాలం

వసంత కాలం (సెప్టెంబర్ నుండి నవంబర్ ) వుంటుంది అపుడు ఇక్కడి వృక్షాలు పూవులు వేస్తాయి ప్రాంతం చాలా అందంగా కనబడుతుంది. శీతాకాలం నవంబర్ మధ్య నుండి మార్చ్ వరకు వుంటుంది. ఈ సమయం లో జమ్మూ లో దట్టమైన మంచు పడి పర్యాటకులకు అసౌకర్యం కలిగిస్తుంది