రాజ్పురి జలపాతాలు, దంపురి జలపాతం, రాణిదాహ జలపాతం, భ్రింగరాజ్ జలపాతాలు, గుళ్ళు జలపాతాలు, చురి జలపాతాలు, బానే జలపాతాలు మొదలైనవి ఈ ప్రాంతంలోని అనేక అందమైన జలపాతాలు.
ప్రసిద్ధ విహార కేంద్రమైన బ్రిన్గరాజ్ జలపాతాలు, జిల్లా ప్రధానకార్యాలయం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్నిటిలోకి రాజ్పురి జలపాతాలు అత్యంత ప్రసిద్ది చెందినవి. పర్యాటకులకు, సందర్శకులకు అద్భుత దృశ్యాలను అందించే రాణిదాహ్ జలపాతాలు, దంపురి జలపాతాలు పచ్చని అడవుల మధ్య ఉన్నాయి. సందర్శనకు విలువైన బానే జలపాతాలు కుంకురి నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి గుల్లు, చురి జలపాతాల తోపాటు ప్రవహిస్తాయి. ఈ జలపాతాల చుట్టూ ఉన్న గొప్ప, వైవిధ్య భరితమైన వృక్ష, జంతుజాతులు మిమ్మల్ని ప్రకృతి లోని సున్నితమైన ప్రయాణానికి తీసుకువెళతాయి.



Click it and Unblock the Notifications