మీరు రాంగడ్ వద్ద ఒక ప్రత్యెక పర్యాటక కేంద్రాన్ని, ఒక హిందూ యాత్రాస్థలాన్ని చూడాలనుకుంటే, మాయతుంగ్రి ఆలయం ఒక ఖచ్చితమైన ఎంపిక. అద్భుతమైన సహజ అందంతో ఉన్న ఈ ఆలయం చుతుపాలు వాలీ లోని రాంగడ్ కి దక్షిణాన 5 కిలోమీటర్లలో ఉంది. ఇది 300 అడుగుల ఎత్తులో ఉంది, ప్రతి ఏటా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, స్థానికులు కర్మ అనే పండుగను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ కొండమీద ప్రార్ధనలు చేస్తే వర్షాలు పడతాయని స్థానికులలో ప్రసిద్ధ నమ్మకం. ఈ కొండపై దుర్గాపూజ, నవరాత్రి ఉత్సవాలు ఏడాదికి రెండుసార్లు జరుగుతాయి.



Click it and Unblock the Notifications