ఫ్రెంచ్ వాస్తు శిల్పిచే చెక్కబడిన జుబ్బల్ కోట ఒక చారిత్రక పర్యాటక ప్రదేశము. "రాణాస్ ఎబోడ్" గా పిలవబడే ఈ కోట చైనా వాస్తు కళని తలపిస్తుంది. ఈ కోట అడుగు భాగం ఇసుకరాయితో నిర్మిచటం దీని ప్రత్యేకత.
దేవదారు కలపని ఉపయోగించి కోట సగ భాగాన్ని నిర్మించారు. 18 అడుగుల ఎత్తులో చెక్కతో చేసిన మహా ద్వారము ఈ కోట ప్రవేశ ద్వారము. కోట లో పురాతన వస్తువులతో పాటు పెద్ద లైబ్రరీలో పర్షియన్, సంస్క్రుత పుస్తకాలు కొలువు దీర్చబడి ఉన్నాయి. ఆధునీకరించబడిన కోట భాగం ఇండో-యూరోపియన్ శైలిని పోలి ఉంటుంది. ఈ కోట లో జుబ్బల్ రాజ వంశీయులు ఉపయోగించిన ఆయుధాలు ప్రదర్శనకి ఉంచబడ్డాయి.



Click it and Unblock the Notifications