జుబ్బల్ - పచ్చటి మైదానాలతో కనువిందు

పబ్బర్ నది ఒడ్డున ఉన్న జుబ్బల్ సముద్ర మట్టానికి 1901 మీటర్ల ఎగువన ఉన్న పర్యాటక ప్రాంతము. 288 చదరపు మైళ్ళు విస్తరించి ఉన్న జుబ్బల్ పచ్చటి మైదానాలతో కనువిందు చేస్తూ ఉంటుంది. 1814-1816 మధ్య జరిగిన గూర్ఖా యుద్ధం తరువాత జుబ్బల్ కి స్వాతంత్ర్యం వచ్చింది. జుబ్బల్ సామ్రాజ్యాన్ని రాజా కరంచంద్ స్థాపించారు. 15 ఏప్రిల్ 1948న రాజ దిగ్విజయ్ సింగ్ పరిపాలించేటప్పుడు భారత భూభాగంలో అది భాగమయ్యింది.

దేవదారు అడవులు,యాపిల్ వ్రుక్ష సముదాయాలతో నిండి ఉన్న జుబ్బల్ అనేక మంది పర్యాటకులని ఆకర్షిస్తూ ఉంటుంది. "చంద్ర నహన్ సరస్సు","జుబ్బల్ కోట" ఇక్కడి ప్రసిద్ధ దర్శనీయ స్థలాలు. చంద్ర నహన్ సరస్సు పబ్బర్ నదీ జన్మస్థానము. ఇక్కడ పర్యాటకులు ఫిషింగ్ చేయడానికి అవకాశం ఉంది.

చైనా వాస్తు శాస్త్రానుసారం కట్టబడిన జుబ్బర్ కోటలో జుబ్బర్ రాజుల వైభవాన్ని చూడవచ్చు. ఈ కోటనే "రాణాస్ ఎబోడ్" అని కూడా అంటారు.

జుబ్బల్ లో ఉన్న "హటకేశ్వరి" గుడి కూడా దర్శనీయ స్థలమే. జానపదుల కధ ప్రకారం ఈ గుడిని పాండవులు నిర్మించారు. కానీ చరిత్ర కారులు మాత్రం ఈ గుడి క్రీ.శ. 800-1000 మధ్య నిర్మించబడినట్లు చెపుతారు. ఆ తరువాత 19 వ శతాబ్దం లో జుబ్బల్ వంశీయుల పాలనలో ఈ గుడి ని ఆధునీకరించారు. జూలై మాసం లో నిర్వహించే "రాంపూర్ జాతర","హేమీస్" జుబ్బల్ కి అదనపు ఆకర్షణ. "హేమిస్" పండుగ ని టిబెట్ బౌద్ధ మతంలో ముఖ్యుడైన గురు పద్మ సంభవుని గౌరవార్ధం జరుపుతారు. ఈ గురువు గారినే "ద లయన్ రోరింగ్ గురు(సిమ్హం లా గర్జించే గురువు)" అని కూడా పిలుస్తారు.

రైలు,రోడ్డు మరియు వాయు మార్గాల ద్వారా జుబ్బల్ అనుసంధానించబడినది. శీతాకాలం మరియు వసంత రుతువు జుబ్బల్ ని సందర్శించటానికి అనువైన సమయాలు. ఆ సమయాలలో ఇక్కడి వాతావరణ పరిస్థితులు జుబ్బల్ సందర్శకులకి ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి.

Please Wait while comments are loading...