సందర్శనకు అనుకూల సమయంకాబిని సందర్శించేందుకు నవంబర్ మరియు జూన్ నెలల మధ్య అనుకూలంగా ఉంటుంది. వర్షాలతర్వాత ఈ అటవీ ప్రదేశం పచ్చగా, ఎంతో అందంగా, ఆకర్షణీయంగా తయారై ఉంటుంది.
వేసవి (మార్చి నుండి మే) : వేసవిలో కాబిని ఎంతో వేడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలుగాఉంటుంది, రాత్రులలో అది 10 డిగ్రీలకు పడిపోయి, చల్లగా ఆనందంగా ఉంటుంది.
వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) : కాబిని వర్షాకాలంలో అధిక వర్షాలు పొందుతుంది. కనుకపర్యాటకులకు అనువైనది కాదు.
చలికాలం (అక్టోబర్ నుండి ఫిబ్రవరి) : చలికాలంలో కాబిని చాలా చల్లగా, ఆహ్లాదంగా ఉంటుంది.చలికాలంలో ఉష్ణోగ్రతలు 6 నుండి 26 డిగ్రీలవరకు ఉంటాయి. అయితే, పర్యాటకులు కాబిని ప్రాంతసందర్శనలో చలికాలంలో అవి బయటకు రాని కారణంగా జంతువులను చూడటం కష్టమవుతుంది.