వాయు మార్గం ప్రధాన నగరం కడప నుండి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో స్వదేశీ విమానాశ్రయం ఉంది. హైదరాబాద్ మరియు తిరుపతి నుండి మాత్రమే విమానాలు ఈ విమానాశ్రయానికి వస్తాయి. కడప నుండి 134 కిలో మీటర్ల దూరం లో తిరుపతి విమానాశ్రయం ఉంది. అయినా ఇది కూడా దేశీయ విమానాశ్రయం మాత్రమే. అతి సమీపంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో ఉన్న విమానాశ్రయం. కడప విమానాశ్రయం నుండి టాక్సీ లేదా ఆటో రిక్షా ద్వారా నగరానికి చేరుకోవచ్చు.