ప్రయాణానికి అనువైన కాలం కణతల్ లో వాతావరణం సంవత్సరం పొడుగునా ఆహ్లాదం గా ఉండటం వల్ల సంవత్సరం లో ఎప్పుడైనా ఈ గ్రామాన్ని సందర్శించవచ్చు. కానీ వర్షాకాలంలో కురిసే అధిక వర్షాల వల్ల ఈ కాలం పర్యాటకులకి అంత అనువైనది కాదు
వేసవి కాలంఇక్కడ వేసవి కాలం ఏప్రిల్ లో మొదలయ్యి జూన్ వరకూ ఉంటుంది. ఇక్కడి గరిష్ట కనిష్ట ఉష్ణొగ్రతలు 25 డిగ్రీలు మరియు 10 డిగ్రీలు. రాత్రి పూట ఇక్కడి ఉష్ణొగ్రతలు పడిపోతుండటం వల్ల వేసవిలో కూడా పర్యాటకులు తమ వెంట పలుచటి ఉన్ని వస్త్రాలు తెచ్చుకుంటే మంచిది. కణతల్ ప్రక్రుతి సౌందర్యాన్ని చూడటానికి వేసవి అనువైన సమయం.
వర్షాకాలంజూలై ఆగస్టు నెలలలు వర్షాకాలపు నెలలు. ఇక్కడ ఈ సమయం లో వర్షాలు అధికంగా పడతాయి.
శీతాకాలంఅక్టొబరు ఫిబ్రవరీ మధ్యలో ఇక్కడ శీతాకాలం. ఇక్కడి గరిష్ట కనిష్ట ఉష్ణొగ్రతలు 18 డిగ్రీలు మరియు 5 డిగ్రీలు. డిశంబరు,జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఇక్కడ మంచు కురవడం సాధారణం. సాహస క్రీడ అయినా "స్కీయింగ్" ని ఈ కాలం లో బాగా ఆస్వాదించవచ్చు.