Search
  • Follow NativePlanet
Share

కణతల్ - వేసవి విడిది!

9

ఉత్తరాఖండ్ రాష్ట్రం టెహ్రీ గర్వాల్ జిల్లాలో చంబా-ముస్సోరీ హైవే పై "కణతల్" ఒక చిన్న గ్రామం. ఈ అందమైన గ్రామం సముద్ర మట్టానికి 8500 మీటర్ల ఎత్తులో ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలవారికి ఇది ఒక విడిది స్థలం. ఈ గ్రామానికి నలువైపులా ఉన్న పచ్చటి పరిసరాలు,మంచుతో కప్పపడిన పర్వతాలు,నదులు, అడవులు ఈ గ్రామ అందాన్ని మరింత పెంచుతాయి.

ఒకానొకప్పుడు ఉన్న "కణతల్" సరస్సు పేరు మీద ఈ గ్రామం ఏర్పడింది. కానీ ఇప్పుడు ఈ సరస్సు ఆనవాళ్ళు లేవు.ఈ గ్రామం లో ఉన్న పలు దర్శనీయ స్థలాలలో సురఖండా దేవి గుడి బాగా ప్రసిద్ధి. జాన పద కధ ప్రకారాం పరమ శివుడు సతీ దేవిని కైలాస పర్వతానికి తీసుకెడుతుండగా సతీ దేవి శరీరం పడిన ప్రదేశం ఇది. సతీ దేవి వివిధ శరీర భాగాలు పడిన ప్రదేశాలు "శక్తి పీఠాలు" గా ప్రసిద్ధి.సురఖండా దేవి గుడి ఈ శక్తి పీఠాలలో ఒకటి. ప్రతీ సంవత్సరం మే, జూన్ నెలలలో ఇక్కడ "గంగ దశరా"పండగ ని అత్యంత ఆసక్తి, ఉత్సాహలతో జరుపుతారు.

ప్రపంచంలో ఎత్తైన డ్యాములలో ఒకటైన టెహ్రీ డ్యాం కణతల్ లో మరొక పర్యాటక ప్రాంతం. ఈ బహుళార్ధ సాధక డ్యాం ని భాగీరధీ నది పైన నిర్మించారు. భాగీరధీ నది ద్వారా చుట్టు పక్కల ప్రాంతాలకి నీటి సరఫరా జరుగుతుంది. సులువుగా ట్రెక్కింగ్ చేసి చేరుకునే "కొడియా జంగిల్" ని కూడా పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. ఈ ట్రెక్కింగ్ సమయం లో పర్యాటకులు చుట్టుపక్కల ఉన్న అందమైన నీటి ఊటల ని చూడవచ్చు. ఇంకా చిన్న ఆసియా జింక అయిన "బార్కింగ్ డీర్","అడవి పంది",జింక జాతికి చెందిన "గోరల్","కస్తూరి జింక" లని కూడా చూడవచ్చు.

కణతల్ నుండీ 75 కిలో మీటర్ల దూరంలో ఉన్న శివ పురిలో సందర్శకులు "రాఫ్టింగ్" కూడా చెయ్యచ్చు. శివ పురి శివుడి ఆలయాలకి ప్రసిద్ధి చెందిన చిన్న గ్రామం. సండర్శకులు ఇక్కడి బీచ్ క్యాంపుల్లో రాత్రి గడిపి మరునాడి రాఫ్టింగ్ కి వెళ్ళవచ్చు. ఇక్కడి ప్రశాంత ఆహ్లాద వాతావరణం ప్రపంచ నలుమూలలనుండీ పర్యాటకులని ఆకర్షిస్తూ ఉంటుంది.

రైలు,రోడ్డు,వాయు మార్గాలా ద్వారా మన దేశంలోని విచిధ ప్రాంతాల నుండి కణతల్ అనుసంధానించబడి ఉంది. డెహ్రాడూన్ లో గల జాలీ గ్రాంట్ విమానాశ్రయం కణతల్ కి దగ్గర లో గల విమానాశ్రయం. ఇది కణతల్ కి 92 కిలో మీటర్ల దూరంలో ఉంది. డెహ్రాడూన్, రిషీకేష్ రైల్వే స్టేషన్లు కణతల్ కి దగ్గరలో గల స్టేషన్లు. పర్యాటకులు లగ్జరీ, నాన్ లగ్జరీ బస్సుల ద్వారా ముస్సోరీ,రిషీకేష్,చంబా,డెహ్రాడూన్,హరిద్వార్ మరియు తెహ్రీ ల నుండి ఈ గ్రామాన్ని చేరుకోవచ్చు. కణతల్ లో వేసవి కాలం ప్రక్రుతి ద్రుశ్యాలకి, శీతాకాలం సాహసోపేత క్రీడలకి అనువైన సమయాలు.

కణతల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కణతల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కణతల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కణతల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం డెహ్రాడూన్,రిషీకేష్,హరిద్వార్,టెహ్రీ,చంబా మరియు ముస్సోరీ ల నుండి ట్యాక్సీలు, బస్సుల ద్వారా పర్యాటకులు కణతల్ చేరుకోవచ్చు. న్యూ ఢిల్లీ కష్మీరీ గేట్ అంతర్ రాష్ట్ర బస్సు టెర్మినల్ నుండి ఏసీ లగ్జరీ మరియు సాధారణ బస్సులు ముస్సూరీ, చంబా రిషీకేష్ లకి ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం 85 కిలో మీటర్ల దూరం లో ఉన్న డెహ్రాడూన్,75 కిలో మీటర్ల దూరం లో ఉన్న రిషీకేష్ రైల్వే స్టేషన్లు కణతల్ కి దగ్గరలో గల స్టేషన్లు. డెహ్రాడూన్ నుండి ఢిల్లీ,ముంబాయి,వారణాసి,గోరఖపూర్,కోల్కతా,ఉజ్జయిని,అమ్రిత్ సర్, చెన్నై లకి తరచుగా రైళ్ళు ఉన్నాయి. డెహ్రాడూన్,రిషీకేష్ ల నుండి ట్యాక్సీలు,క్యాబ్ ల ద్వారా కణతల్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం డెహ్రాడూన్ లో గల జాలీ గ్రాంట్ విమానాశ్రయం కణతల్ కి దగ్గరలో గల విమానాశ్రయం. ఇది కణతల్ కి 92 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది న్యూ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానించబడింది. ఇక్కడి నుండి ఢిల్లీకి విమానాలు తరచుగా ఉన్నాయి. ట్యాక్సీలు,క్యాబ్ ల ద్వారా విమానాశ్రయం నుండీ కణతల్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri