Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరూర్ » వాతావరణం

కరూర్ వాతావరణం

ఉత్తమ సమయం వర్షాకాలం తరువాత అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ;ఉండే శీతాకాలంలో కరూర్ ని సందర్శించడం ఉత్తమం. ఈ సమయంలో వాతావరణం పాక్షికంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కనుక పర్యటన ఆనందకరంగా ఉంటుంది.

వేసవి

వేసవి కరూర్ పాక్షిక ఉష్ణమండల వాతావరణాన్ని కలిగిఉంటుంది, వేసవి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. మార్చ్ నుండి జూన్ వరకు ఇక్కడి ఉష్ణోగ్రత 32 డిగ్రీల నుండి 37 డిగ్రీల వరకు ఉంటుంది. తీవ్రమైన వేడికి ప్రయాణం ఆనందంగా ఉండదు కనుక ఈ సమయంలో ఈ నగరాన్ని సందర్శించడం ఉత్తమం కాదు.

వర్షాకాలం

వర్షాకాలం జూన్ నుండి అక్టోబర్ వరకు ఉండే వర్షాకాలంలో కరూర్ ఒకమోస్తరు వర్షపాతాన్ని కలిగిఉంటుంది. ఈ వర్షాలు భరించలేని వేడి నుండి విరామాన్ని ఇస్తాయి. వర్షాకాలం తరువాత ఉష్ణోగ్రత అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం కరూర్ లో శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. సంవత్సరంలో ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రత 17 డిగ్రీల నుండి 28 డిగ్రీల మధ్య ఉంటుంది. ఈ పట్టణ సందర్శనకు ఇది ఉత్తమ సమయం.