Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాజిరంగా » వాతావరణం

కాజిరంగా వాతావరణం

కాజీరంగా జాతీయ పార్కును పర్యాటకుల కోసం నవంబర్ నుండి మే నెల వరకు తెరిచి ఉంచుతారు. లేదంటే భారీ వర్షాల కారణంగా ఈ పార్కును మూసి ఉంచుతారు. వర్షాల తర్వాతి నెలలు ఆహ్లాదకర౦గా ఉండి, సందర్శనకు అనువైనవి. మంచి వేసవి నెలలలో అనేక జంతువులను చూసే అవకాశం ఉంది.

వేసవి

వేసవి కాలం కాజీరంగా లో మార్చి, ఏప్రిల్, మే వేసవి నెలలు. ఇవి వేడిగా ఉండే నెలలే కాక, గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ గానూ, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గాను వేసవిలో నమోదు చేయబడుతుంది. ఇది పొడిగా ఉండే కాలమే కాక, ఎంతో గాలులతో కూడి ఉంటుంది. మే నెలలో అనేక జంతువులను చూడవచ్చు.

వర్షాకాలం

వర్షాకాలం ప్రపంచంలోని ఈ భాగంలో రుతుపవనాలు భారీ వర్షాలను తెస్తూ, పార్కు లోని చాల భాగాన్ని ముంచెత్తుతాయి. జూన్, ఆగష్టు, సెప్టెంబర్ వర్షాకాలం లోని నెలలు. పార్కును ఈ నెలలలో పర్యాటకుల కోసం మూసి ఉంచుతారు. కాజీరంగాలో సంవత్సరపు సగటు వర్షపాతం 2220 మిల్లీమీటర్లు. ఏకబిగిన 5-10 రోజుల వరకు ఈ పార్కు వరదతో నిండి ఉంటుంది.

చలికాలం

శీతాకాలం కాజీరంగా జాతీయ పార్కు లో శీతాకాలం నెలలు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఈ కాలంలో సగటు ఉష్ణోగ్రత 5 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య మారుతూ ఉంటుంది. ఎంతో తేలికగా ఉండే వాతావరణం పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది పార్కు ఎంతో రద్దీగా ఉండే ముఖ్యమైన కాలం.