Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కియో౦ఝర్ » వాతావరణం

కియో౦ఝర్ వాతావరణం

కియో౦జహార్ వాతావరణం ఒకమోస్తరు వాతావరణ పరిస్థితి ఉండే నవంబర్ మాసంలో కియోంఝర్ సందర్శన సరైనది. ఈ సమయంలో రోజంతా వాతావరణం చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉండి, ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని నింపుతుంది.  

వేసవి

వేసవి కియోంఝర్ లో మార్చ్ నుండి మే చివరి వరకు ఉండే వేసవి చాలా వేడిగా, ఆర్ద్రంగా ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు పెరుగుతుంది, సాయంత్రాలు సాధారణంగా 25 డిగ్రీలకు పడిపోయి సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ సమయంలో కియోంఝర్ పర్యటన సూచనప్రాయం కాదు.  

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలంలో కియోంఝర్ భారీ వర్షపాతాన్ని కలిగిఉంటుంది. కియోంఝర్ లో వర్షాకాలం జూన్ నుండి ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. ఈ జిల్లలో వర్షాకాలం మూడు నెలలు నిలబడి ఉంటుంది, మొత్తం వర్షాకాల నెలలు రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తాయి. సంవత్సరంలో ఈ మాసాలలో ఈ ప్రాంతాన్ని సందర్శించ వద్దని సూచన. కొన్నిసార్లు వర్షాకాలం అక్టోబర్ చివరి వరకు విస్తరించి ఉంటుంది.  

చలికాలం

శీతాకాలం శీతాకాలాలు తక్కువగా ఉంటాయి, కానీ కియోంఝర్ లో ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. కొన్నిసార్లు వాతావరణం చాలా చలిగా ఉంటుంది, పర్యాటకులు ఈ సమయంలో ఊలు బట్టలతో ఈ ప్రాంతాన్ని సందర్శించ వచ్చని సూచన. కొన్నిసార్లు ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు పడిపోతుంది.