Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖమ్మం » వాతావరణం

ఖమ్మం వాతావరణం

ఉత్తమ సమయం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఖమ్మం సందర్శించడం ఉత్తమం. ఈ మాసాలలో ఉష్ణోగ్రత అన్ని సమయాలలో తక్కువగా ఉండి, ప్రయాణానికి, స్థల సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. డిసెంబర్, జనవరి మాసాలలో సాయంత్రాలు, రాత్రులు సాధారణం కంటే కొంచెం ఎక్కువ చల్లగా ఉంటుంది, అందువల్ల కొన్ని ఉన్ని దుస్తులను తీసుకువెళ్ల వలసి ఉంటుంది.

వేసవి

వేసవి ఖమ్మం లో వేసవి మార్చ్ లో ప్రారంభమై ఏప్రిల్, మే, జూన్ వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో మే, జూన్ నెలలలో ఉష్ణోగ్రత అత్యధికంగా 42 డిగ్రీలు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ తీవ్రమైన ఎండలు వుండడం వల్ల ఖమ్మం వెళ్ళడ౦ మంచిది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం ఖమ్మం లో వర్షాకాలం జూన్ చివరలో ప్రారంభమై, సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. ఖమ్మం ఉష్ణమండల ప్రాంతం కాబట్టి వర్షపు జల్లులు అక్టోబర్, నవంబర్ నెలల్లో మాత్రమె కురుస్తాయి. ఈ ప్రాంతంలో ఓ మాదిరి నుండి అధిక వర్షపాతం ఉంటుంది, ఈ నెలల్లో 35 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతకు పడిపోతుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలం లో ఖమ్మం తక్కువ చల్లదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ నగరం ఉత్తర భారత౦లో లాగా చల్లటి గడ్డకట్టే శీతాకాలం లాగా ఉండదు. శీతాకాలం నవంబర్ చివరలో మొదలై ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువ చల్లగా ఉండే మాసం జనవరి. శీతాకాల సరాసరి కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.