Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖీచన్ » వాతావరణం

ఖీచన్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం :ఖీచన్ పక్షి అభయారణ్యానికి పక్షులు వలస వచ్చే అక్టోబర్ మధ్య నుండి మార్చ్ వరకు ఉన్న కాలం ఖీచన్ సందర్శనకు ఉత్తమమైనది. ఈ సమయంలో పక్షులు భారీసంఖ్యలో ఇక్కడ కనబడతాయి, ఫలితంగా ప్రంపంచం నలుమూలలనుండి పక్షులను గమనించేవారు ఈ ప్రాంతానికి విరివిగా వస్తారు.

వేసవి

ఖీచన్ లో అన్ని ఎడారి ప్రాంతాలలాగే తీవ్రమైన వాతావరణం ఉంటుంది.వేసవి కాలం (ఏప్రిల్ నుండి జూన్ వరకు) : ఖీచన్ లో 30 డిగ్రీల నుండి 45 డిగ్రీల సెంటీగ్రేడుల మధ్య వుండే ఉష్ణోగ్రతతో వేసవికాలాలు తీవ్రమైన వేడి ఉంటాయి. ఈ ప్రాంతపు ప్రధాన ఆకర్షణ పక్షులు ఈ నెలలలో ఇక్కడ కనిపించనందున ఈ సమయం ఖీచన్ ప్రాంతాన్ని సందర్శించడానికి సరైనదికాదు.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్) : ఖీచన్ ప్రాంతంలో తక్కువ నుండి మధ్యస్తమైన వర్షపాతం ఉంటుంది, వర్షాకాలపు నెలలైనప్పటికి ఈ కాలంలో వాతావరణం చాల వేడిగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు) : 10 డిగ్రీల నుండి 25 డిగ్రీల మధ్యస్థమైన ఉష్ణోగ్రతతో ఈ ప్రాంతంలో తేలికపాటి శీతకాలాలు ఉంటాయి. ఏడాదిలో భారీ సంఖ్యలో పక్షులు కనబడే ఈ సమయం ఈ ప్రాంత సందర్శనకు ఉత్తమమైనది.