ప్రయాణికులు విమానం, రైల్, బస్సుల ద్వారా సులభంగా కిన్నౌర్ ప్రాంతాన్ని చేరుకోవొచ్చు. విమానం ద్వారా: కిన్నౌర్ కి దగ్గరగా 'షిమ్ల విమానాశ్రయం' ఉన్నది. ఇది కిన్నౌర్ జిల్లాలో ఉన్న ప్రముఖ గ్రామం, 'కల్ప' నుండి 249 కి. మీ. దూరంలో ఉంది. షిమ్ల విమాన కేంద్రం నేరుగా ఇండియా ముఖ్య నగరాలైన 'డిల్లీ' మరియు 'కుల్లు' లకు అనుసంధించబడింది. విదేశీ ప్రయాణికులు డిల్లీ నుండి ఇక్కడకు జత చేయబడిన విమానాలలో రావొచ్చు. విమానాశ్రయం నుండి టాక్సీలు మరియు కబ్స్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.