Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కిన్నౌర్ » వాతావరణం

కిన్నౌర్ వాతావరణం

ప్రయాణానికి మంచి కాలం: ప్రయాణికులు సంవత్సరంలో ఏ సమయంలోనైనా కిన్నార్ విహారయాత్రకు ప్లాన్ చేసుకోవొచ్చు. అయితే, వేసవి కాలంలో తేలికపాటి ఊలు దుస్తులను మరియు శీతాకాలంలో భారీ ఉన్ని దుస్తులను తీసుకు వెళ్ళటం మంచిది.

వేసవి

కిన్నార్ వాతావరణం సంవత్సరం పొడవునా సమశీతలంగా ఉంటుంది. యాత్రికులను సంవత్సరంలో ఏ సమయంలోనైనా సరే, ఈ స్థలం సందర్శిస్తున్న సమయంలో ఉన్ని దుస్తులను తెచ్చుకోమని సలహా ఇస్తారు.వేసవికాలం(జూన్ నుండి సెప్టెంబర్): కిన్నౌర్ ప్రాంతంలో వేసవి జూన్ నుండి సెప్టెంబర్ నెలల మధ్యన ఉంటుంది. ఈ కాలంలో, వాతావరణం ఇక్కడ సాధారణంగా చల్లగానే ఉంటుంది కాని రాత్రి ఉష్ణోగ్రత చాలా తగ్గుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 20 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. పర్యాటకులు తప్పనిసరిగా సాధారణ ఉన్ని దుస్తులను తెచ్చుకోవటం మంచిది.

వర్షాకాలం

వర్షాకాలం: సాధారణంగా కిన్నౌర్ లోతట్టు ప్రాంతాలలో వర్షపాతం ఉంటుంది. ఇంచుమించు సంవత్సరమంతా కూడా మొత్తం ప్రాంతం పొడిగానే ఉంటుంది. కొన్ని ప్రదేశాలు, ఏవైతే ఎత్తులో ఉన్నాయో, అవి మాత్రం కొద్ది వర్షపాతాన్ని తీసుకుంటున్నాయి.

చలికాలం

శీతాకాలం(అక్టోబర్ నుండి మే): కిన్నౌర్ లో శీతాకాలం అక్టోబర్ మరియు మే నెలల మధ్యన ఉంటుంది. ఈ సమయంలో, ఉష్ణోగ్రతలు -0 డిగ్రీలకు పడిపోతుంది. ఈ సమయంలో ఈ ప్రాంతపు అత్యధిక ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెంటిగ్రేడ్ గా నమోదు అవుతుంది. ఈ సమయంలో దీనిని సందర్శించే ప్రయాణికులు తాప్పనిసరిగా భారి ఉన్ని దుస్తులు తెచ్చుకోవాలి.