అత్యుత్తమ సమయం కొడంగలూర్ లోని మిశ్రమ వాతావరణం , కేవలం వర్షాకాలం తప్ప, తక్కిన సంవత్సరం పొడుగునా పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. డిసెంబర్ నించి ఫిబ్రవరి ఈ పట్టణం సందర్శిండానికి అత్యుత్తమ సమయం. ఆగష్టు నించి నవంబర్ మధ్య కాలం లో చాలా వేడుకలు జరగడం వల్ల, కొడంగలూర్ వెళ్ళటానికి అది కుడా మంచి సమయం.
వేసవి కాలం కొడంగలూర్ లో వేసవులు మార్చ్ నెలలో మొదలయ్యి మే నెల దాకా కొనసాగుతాయి. ఈ కాలం లో సాపేక్షకంగా పొడి వాతావరణం ఉండి , ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెం.గ్రే దాకా చేరుకుంటాయి. ఈ ప్రాంతంలోని ఆలయాలని సందర్శించడానికి ఇది మంచి సమయం. పర్యాటకులు తేలికపాటి వేసవి దుస్తులు తీసుకువెళ్లటం మంచిది.
వర్షాకాలం జూన్ నెలలో మొదలయ్యి సెప్టెంబర్ దాకా కొనసాగే వర్షాకాలం లో కొడంగలూర్ లో తేమ ఎక్కువగా ఉంటుంది. పట్టణం భారీ వర్షపాతం నమోదు చేసుకుంటుంది. నాలుగు నెలలు పాటు జల్లులు కురుస్తాయి. జూన్ జూలై నెలలలో విపరీతమైన వర్షాల కారణంగా బయట కార్యక్రమాలు మందగిస్తాయి కాబట్టి ఈ సమయం లో వెళ్లకపోవటం ఉత్తమం.
శీతాకాలం శీతాకాలం లో వాతావరణం తేలిక గా ఉండి ఆహ్లాదపరుస్తుంది. డిసెంబర్ మొదలకుని ఫిబ్రవరి దాకా ఇక్కడ చలికాలం కొనసాగుతుంది. ఈ కాలం లో ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల సెం.గ్రే నించి 32 డిగ్రీల సెం.గ్రే వరకు మారుతూ ఉంటుంది. కొడంగలూర్ పట్టణం సందర్శిండానికి ఇది సరైన సమయం.