Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కొడంగల్లూర్

కొడంగలూర్ : దేవాలయాలు - చరిత్ర నిండిన ఒక అందమైన పట్టణం

21

త్రిస్సూర్ జిల్లా లోని చిన్న పట్టణం అయినటువంటి కొడంగలూర్ , మలబార్ తీరం లో ఉంది. ఓడ రేవు కు, దేవి భగవతి మందిరానికి ప్రసిద్ధి చెందిన ఈ ఊరికి శతాబ్దాల చరిత ఉంది. క్రీ.శ. 7 వ శతాబ్దం లో చేరమాన్ ప్రభువుల రాజధాని గా ఉండటం తో దీనికి చారిత్రిక ప్రాముఖ్యం ఏర్పడింది. సముద్రానికి సమీపంలో ఉండటం వల్ల కొడంగలూర్, హిందూ మహా సముద్రం లో ఒక ముఖ్య వాణిజ్య ప్రదేశం గా వర్ధిల్లింది. ఆధునిక చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఈ పట్టణానికి సిరియా, ఆసియా మైనర్, ఈజిప్ట్ లాంటి మధ్య ప్రాశ్చ్య దేశాలతో వర్తక సంబంధాలు ఉండేవి.

ప్రాచీన చరిత్రలు, సమోన్నత సంస్కృతులు ...

ప్రాచీన కాలం నించి కొడంగలూర్ అనేక విలువైన సువాసనా ద్రవ్యాల ప్రధాన ఎగుమతిదారు గా ఇతర దేశాల్లో పేరు పొందింది. "యవనప్రియ" మిరియాలు ప్రధానం గా ఎగుమతి అయ్యేవి. సముద్రం తో, ఉప్పు నీటి కాలవలతో చుట్టబడిన ఈ పట్టణం, ఘనతకెక్కిన గత చరిత్ర తో వర్ధిల్లుతుంది. ప్రాచీన కొడంగలూర్ రేవు క్రీ.పూ. 1 వ శతాబ్దం లోనే నావిక కార్యకలాపాలతో కోలాహలం గా ఉండేది.

క్రైస్తవం, యూదు, మహమ్మదీయ మరియు ఇతర మతాల కి ప్రవేశ ద్వారంగా నిలచిన తీరానికి కొడంగలూర్ సంస్కృతి ఏంతో రుణ పడి ఉంది. కొడంగలూర్ ద్వారానే క్రైస్తవం కేరళ చేరుకుంది. సెయింట్ థామస్ ఇక్కడికి క్రీ.శ 52 "సువార్త" ని ప్రచారం చేయటానికి వచ్చాడని నమ్మిక. ఈ పట్టణం భారత దేశంలోనే మొదటి చర్చి కి చిరునామా. భారతీయ మహమ్మదీయ చరిత్ర లో కూడా కొడంగలూర్ కి విశిష్ట స్థానం ఉంది. క్రీ.శ 629 లో నిర్మించబడ్డ చేరమాన్ జమా మసీదు భారత దేశంలోనే మొట్ట మొదటి మహమ్మదీయ ప్రార్థనా మందిరం గా పరిగణించబడుతుంది.

సంస్కృతుల , మతాల సంగమం ...

సమకాలీన సమయంలో కొడంగలూర్ ఒక యాత్రికుణ్ని, ఒక చరిత్రకారుణ్ని సమంగా సంతృప్తి పరుస్తుంది. ప్రజలు ముఖ్యంగా ఇక్కడి అందమైన తీర ప్రాంతాన్ని వీక్షించడానికి, చరిత్ర లో తల మునకలు అవ్వడానికి, వివిధ మత పరమైన మొక్కులు తీర్చుకోడానికి కొడంగలూర్ ప్రయాణిస్తారు. అరేబియన్ సముద్రం, పెరియార్ నది తో పరివేష్టించబడిన ఈ ప్రదేశం ప్రకృతి ప్రేముకులని దగ్గరకు రప్పిస్తుంది.

ఔత్సాహికులైన పర్యాటకులకు ఈ పట్టణం లెక్కలేనన్ని వినోదాలు చూపిస్తుంది. కేరళ ఆధునిక చరిత్ర లో కొడంగలూర్ ప్రఖ్యాత భగవతి మందిరానికి నెలవు గా పేరు మోసింది. పట్టణ ప్రధాన ప్రాంతంలో గల కురుంబ భగవతి ఆలయం ( కొడంగలూర్ భగవతి ఆలయం లేక కురుంబకవు ఆలయం గా ప్రసిద్ధి ) లో భద్రకాళి అమ్మవారు కొలువు దీరి ఉంటారు. వినుతికెక్కిన కొడంగలూర్ భరణి , తలప్పొలి ఉత్సవాలు లక్షలాది భక్తులని పండుగ రోజుల్లో ఇక్కడికి చేరుస్తాయి.

కీళ్ తలి మహాదేవ ఆలయం, కూడళ్ మాణిక్యం ఆలయం, మర్ తోమ చర్చి, శృంగపురం మహాదేవ ఆలయం, తిరువచిక్కులం మహాదేవ ఆలయం, త్రిప్రయార్ శ్రీ రామ ఆలయం ఇక్కడి ఇతర ముఖ్య మత ప్రదేశాలు. బంగారు వన్నె ఇసుక తీరాలతో , తాటి చెట్ల వరసలతో మనోహరంగా ఉండే కద్దిపురం సముద్రతీరం తీర ప్రేమికులకు, జలక్రీడాకారులకు స్వర్గధామం. కొట్టప్పురం కోట శిధిలాలు యాత్రికులను ఆకర్షించే మరో విశేషం.

ఒక వినూత్నమైన ప్రయాణ అనుభవం ...

కేరళ మధ్య భాగం లో ఉండటం వల్ల కొడంగలూర్ కి అనుసంధానం అతి సులభం. ఇది త్రిస్సూర్, కొచ్చి లకు సమ దూరం లో ఉంది. ఉత్తర , దక్షిణ కేరళ నించి కుడా ఇక్కడకి చేరటం తేలిక. దీని జలమార్గం, కేరళలో ఇతర చిన్న పట్టణాల నించి దీన్ని విభిన్నంగా చేస్తుంది. భారతదేశం లో పశ్చిమ తీర కాలువ అధిక పర్యాటక సంభావ్యం గల ముఖ్య నౌకాయానయోగ్య ప్రాంతం.

మరెన్నో ఇతర దక్షిణ భారత పట్టణాల వలే కొడంగలూర్ సంవత్సరం పొడుగునా ఉష్ణ మండీలయ వాతావరణాన్ని అనుభవిస్తుంది. సాగర తీర సామీప్యత దీనికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కానుకగా ఇస్తుంది. ఆసక్తికరమైన చరిత్రతో , అనేకానేక మతపరమైన ప్రదేశాలతో కొడంగలూర్ పర్యాటకులకి విలక్షణమైన అనుభవం అందిస్తుంది.

 

కొడంగల్లూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కొడంగల్లూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కొడంగల్లూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కొడంగల్లూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం కొడంగలూర్ పట్టణానికి విస్తృతమైన రహదారులు ఉన్నాయి. కేరళ రాష్ట్ర రహదారి రవాణ బస్సులు , ప్రైవేటు బస్సులు విరివిగా ఉన్నాయి. ప్రయాణికులు కొడంగలూర్ కి కొచ్చి (44 కి.మీ), త్రిస్సూర్ (38 కి.మీ ), గురువాయుర్ (50 కి.మీ) నించి చేరుకోవచ్చు. దక్షిణ భారత దేశంలోని ఇతర ప్రధాన నగరాలనించి కూడా బస్సులు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం కొడంగలూర్ కి అత్యంత సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ ఇరింగలకుడ (16 కి.మీ లు). ఇరింగలకుడ నించి కేరళ లోని వివిధ ప్రాంతాలకి విరివిగా రైళ్ళు ఉన్నాయి. రైల్వే స్టేషన్ నించి కొడంగలూర్ పట్టణం చేరుకోవడానికి టాక్సీ సేవలను ఉపయోగించుకోవచ్చు. బస్సులు, ఆటో రిక్షా లు కూడా ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం 35 కి.మీ ల దూరం లో గల కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం కొడంగలూర్ కి అత్యంత సమీపంలో ఉన్న విమానాశ్రయం . కొచ్చి విమానాశ్రయానికి భారతదేశంలోని చెన్నై,బెంగుళూరు, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి ముఖ్య నగరాల నించి చక్కటి సంధాయకత ఉంది. విమాన మార్గం లో వచ్చే వారు విమానాశ్రయం నించి టాక్సీ సేవలను ఉపయోగించుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed