Search
  • Follow NativePlanet
Share

తేన్మల - తేనెలు పారే భూమి... !

17

తేన్మల ప్రసిద్ధిగాంచిన ఒక పర్యావరణ పర్యాటక ప్రదేశం. ఇది కొల్లం జిల్లాలో కలదు. దీనిని హిల్ అఫ్ హనీ అని అంటారు. ఈ ప్రదేశం తేనె కు ప్రసిద్ధి. ఈ తేనెలో చాల ఔషద గుణాలు ఉన్నాయని చెపుతారు . ఈ ప్రదేశం కేరళ రాజధాని నగరం నుండి సుమారు 70 కి మీ. దూరంలో కలదు. తేన్మల లోఇండియా లోని మొట్టమొదటి పర్యావరణ పర్యాటక ప్రాజెక్ట్ ప్రణాళిక చేసారు. పర్యావరణ పర్యాటక ప్రాజెక్ట్ లో భాగంగా ఈ ప్రాంతం 5 ప్రధాన జోన్స్ గా విభజించారు.అవి కల్చరల్ జోన్, అడ్వెంచర్ జోన్, విశ్రాంతి జోన్, డీర్ సంరక్షణ శాఖ మరియు బోటింగ్ జోన్ లుగా కలవు. పచ్చటి అడవులలో అనేక ఎకరాలలో వ్యాపించిన తేన్మల లక్షలాది పర్యాటకులను దేశంలోనూ మరియు విదేశాలనుండి ఆకర్షిస్తోంది. ఈ పర్యావరణ పర్యాటక ప్రదేశం వివిధ రకాల మొక్కలకు మరియు వన్య జీవులకు నిలయంగా వుంది. ఈ పర్వత ప్రాంతం అనేక సాహస క్రీడలకు వినోదాలకు అంటే బోటింగ్, రోప్ బ్రిడ్జి, ట్రెక్కింగ్, పర్వతారోహణ ,బైకింగ్ , మరియు ఒక మ్యూజికల్ ఫౌంటెన్ వంటివి కూడా అందించి పర్యాటకులను ఆనందింప చేస్తుంది.

సైట్ సీఇంగ్

సైట్ సీఇంగ్ ప్రియులకు ఈ ప్రదేశం ఒక స్వర్గం గా వుంటుంది.

కల్లాడ నదిపై నిర్మించిన డాం తేన్మలై ప్రాంతం లో ఒక ప్రధానాకర్షణ. పాలరువి జలపాతాలు తేన్మలై ప్రాంతాన్ని ఒక మంచి వినోద మరియు హనీమూన్ ప్రదేశంగా తయారు చేసాయి. ఇక్కడ కల లేళ్ళ పార్కు మరొక ఆకర్షణ. అనేక రకాల లేళ్లు చూడవచ్చు. పార్కులో నిర్మించిన చెట్టు నివాసాలు మీకు ఒక మంచి విశ్రాంతి నివాసంగా అనిపిస్తాయి.

నక్షత్ర వనం, అర్యనకావు శాస్త దేవాలయం, కులతు పూజ శాస్త దేవాలయం మరియు సస్పెన్షన్ బ్రిజ్ వంటివి పర్యాటకులు చూచి  ఆనందించవచ్చు. రోడ్డు మార్గంలో ఈ ప్రదేశానికి తిరువనంతపురం మరియు పునలూర్ ల నుండి తేలికగా చేరవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం సంవత్సరం పొడవున పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఎడ్వెంచర్ లేదా విశ్రాంతి ఏదైనప్పటికీ తేన్మలై మీకు ఆనందాన్ని అందిస్తుంది.

 

తేన్మల ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తేన్మల వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తేన్మల

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తేన్మల

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గంలో తేన్మలై కు తిరువనంతపురం మరియు కొల్లం ల నుండి ప్రభుత్వ లేదా ప్రైవేటు బస్సులలో చేరవచ్చు. రోడ్డు మార్గంలో టాక్సీ మరియు ఇతర వాహనాలలో కూడా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గంలో తేన్మలైకు 66 కి.మీ. దూరంలో కల కొల్లం లో రైలు స్టేషన్ కలదు. ఇక్కడకు దేశంలోని అన్ని ప్రాంతాలనుండి రైళ్ళు నడుస్తాయి. రైలు స్టేషన్ నుండి టాక్సీలలో తేన్మలై కు చేరుకోవచ్చు. టాక్సీ చార్జీలు కి.మీ. కు సుమారు రూ. 7 నుండి రూ. 11 వరకు ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఎలా చేరాలి వాయు మార్గంలో తేన్మలై కు సమీపంలో సుమారు 72 కి.మీ. దూరంలో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడి నుండి ఇండియా లోని ప్రధాన నగరాలకు విమాన ప్రయాణ సదుపాయాలు కలవు. విమానాశ్రయం నుండి టాక్సీ లలో తేన్మలై చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Aug,Thu
Check Out
21 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri