మరారికులం - బీచ్ విహారం...!

మరారికులంలో బీచ్ విహారం ఆనందంగా ఉంటుంది. అలపూజ పట్టణంలో మరారికూలం ఒక అందమైన గ్రామం. బంగారు వన్నెగల ఇసుక బీచ్ మరారికి ప్రసిద్ధి. అలప్పూజ నుండి ఇది 11 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామ ప్రజలు ఎంతో ప్రాచీనకాలంనాటి అంటే సుమారు వందల సంవత్సరాల క్రిందటి జీవన విధానాలు సాగిస్తున్నారు. ఈ గ్రామం పీచు తయారీ కి ప్రసిద్ధి.

 ఈ గ్రామంలోని భూమి సారవంతమైనది. ఎంతో అందమైన గ్రామం. మీరు రిలాక్స్ అయి ఆనందించవచ్చు. ఇక్కడి మత్స్య కారులతో కలసి సముద్రంలోకి వెళ్ళి వారు చేపలు పట్టటం చూసి మీరు కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. వారి ఆచార సాంప్రదాయాలు తెలుసుకోవచ్చు. అసలైన పర్యాటకతకు అద్దం పడుతుంది. నీటి క్రీడలు, వలలు అల్లకం, యోగా, ఆయుర్వేద చికిత్సలు, ధ్యానం వంటివి ఇక్కడ కలవు.

ఈ ప్రాంత ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయి. ఇక్కడ కల కొక్కమంగళం చర్చి సెయింట్ ధామస్ చే స్ధాపించబడిందని చెపుతారు. గొప్ప యాత్రా స్ధలాలలో ఇది ఒకటి. ఈ చర్చి లో వర్జిన్ మేరీ విగ్రహం ఉంటుంది. ఇది కోస్తా పట్టణమైన తుంపోలీలో కలదు. ఈ ప్రదేశంలోని శివాలయం, కొక్కమంగళం సెయింట్ అపోసల్ చర్చి, అరూర్, అరుధంకాలన్, పూచ్ఛక్కాల్, పానావలీ, వెలోర్ వట్టం మరియు అర్ధంకాల్ లు ఇతర ఆకర్షణలు. శివాలయంలోని శిల్ప శైలి అద్భుతం. ఇక్కడ చెర్తాల కార్తియేని దేవాలయం కూడా కలదు. దీనిలో ప్రధాన దైవం దేవి కర్తియాని.

 కంచికుంగ్లార దేవాలయం మరొక ప్రసిద్ధి గాంచిన దేవాలయం. దీనిలో ప్రధాన దైవం భగవతి. పుచ్ఛక్కాల్ సమీప మరొక పట్టణం కూడా అనేక దేవాలయాలను కలిగి ఉంది. మరారికులం గ్రామానికి రోడ్డు, రైలు, వాయు మార్గాలలో చేరవచ్చు. దక్షిణాదిన రోడ్డు మార్గంలో అన్ని ప్రధాన నగరాలకు కలుపబడి ఉంది. ఎపుడు ప్రణాళిక చేయాలి? ఈ ప్రాంతానికి శీతాకాలంలో సందర్శన చేయాలి.

Please Wait while comments are loading...