Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» గురువాయూర్

గురువాయూర్ - భగవంతుడి రెండవ నివాసం

30

గురువాయూర్ పట్టణం కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో కలదు. ఈ ప్రదేశం విష్ణు మూర్తి అవతారమైన శ్రీక్రిష్ణుడి నివాసంగా భావిస్తారు. గురువాయూర్ కేరళలో ప్రసిద్ధి చెందిన పర్యాటక స్ధలం.

గురువాయూర్ పేరులో మూడు పదాల కలయిక కలదు. గురు అంటే గురువు బ్రిహస్పతి, వాయు అంటే వాయు దేవుడు, ఊర్ అంటే మళయాళంలో ప్రదేశం అని అర్ధం. ఈ ప్రదేశం ఒక పురాణం మేరకు ఏర్పడింది. కధనం మేరకు బ్రిహస్పతి కలియుగం మొదటిలో శ్రీక్రిష్ణుడి విగ్రహం ఒక దానిని కనుగొన్నాడని, దానిని వాయుదేవుడితో కలసి ఆవిష్కరించాడని కనుక దీనికి గురువాయూర్ గా పేరు వచ్చిందని చెపుతారు.

గురువాయూర్ ఆకర్షణలలో ఈ క్రిష్ణుడి విగ్రహం ఒక ప్రధాన ఆకర్షణ. విగ్రహానికి నాలుగు చేతులలోను శంఖం, సుదర్శన చక్రం, కౌముదకి మరియు ఒక పద్మం ఉంటాయి. ఈ దేవాలయం అక్కడకు వచ్చే భక్తుల సంఖ్యను బట్టి దేశంలో నాలుగవ పెద్ద దేవాలయంగా చెపుతారు. ఈ దేవాలయం భూలోక వైకుంఠమని ఇక్కడ విష్ణు మూర్తి నివసిస్తాడని విశ్వసిస్తారు. హిందూయేతర ప్రజలను అనుమతించనప్పటికి, వారు దేవాలయం బయటనుండి చూడవచ్చు.

గురువాయూరప్ప దేవాలయం బయట అనేక దుకాణాలు కలవు. ఈ దుకాణాలు సాధారణంగా సాంప్రదాయ పూజా వస్తువులు దీపాలు, కొబ్బరికాయలు, పూలు వంటివి అమ్ముతాయి. కొన్ని బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, డ్రస్ లు ఫొటోగ్రాఫులు, తినుబండారాలు కూడా కొనుగోలు చేయవచ్చు. కొన్ని షాపులలో చేతి కళల వస్తువులు, కేరళ నగలు, కుడ్య చిత్రాలు కూడా దొరుకుతాయి. మీరు కొనుగోలు చేసేట్లయితే, తప్పక బేర సారాలు చేయండి.

ఈ దుకాణాలేకాక, హోటళ్ళు, లాడ్జిలు కూడా దేవాలయం బయట కలవు. మీరు ఈ దుకాణాలకు అర్ధరాత్రి అయినా సరే వెళ్ళి కొనుగోళ్ళు చేయవచ్చు.

గురువాయూర్ లో ఇస్కాన్ సెంటర్, మమ్మియూర్ మహదేవ దేవాలయం లు కూడా దర్శించదగినవి. పార్ధసారధి దేవాలయం, చాముండేశ్వరి దేవాలయం, చౌవల్లూర్ శివ దేవాలయం, హరికన్యకా దేవాలయం మరియు వెంకటాచలపతి దేవాలయం లు కూడా ఇక్కడే కలవు. ఈ దేవాలయాల మద్యన పలయూర్ చర్చి కలదు. ఇక్కడకు కూడా పర్యాటకులు అధికంగానే వస్తారు. చర్చి శిల్ప సౌందర్యాలు సుందరంగా ఉంటాయి.

పున్నత్తూర్ కొట్టలో ఏనుగుల శిబిరం కలదు. ఈ ప్రదేశం గురువాయూర్ లో ప్రధాన ఆకర్షణ. ఇక్కడకల చౌవల్లూర్ బీచ్ లో మీరు విహరించి అందమైన పరిసరాలను ఆస్వాదించవచ్చు. దేవస్వామ్ మ్యూజియం కూడా దర్శించదగిన స్ధలమే. ఇక్కడ కుడ్య చిత్రాల లేఖన శిక్షణ ఉంటుంది.

గురువాయూర్ లో అనేక పండుగలు, ఉత్సవాలు ఎంతో ఉల్లాసంగా జరుగుతాయి. హిందూ నెల కుంభ లో పదిరోజుల ఉత్సవం పండుగ జరుగుతుంది. కేరళ ప్రజలకు విష్ణు కొత్త సంవత్సరంలో మొదటి రోజు. కొత్త సంవత్సరం రోజున గురువాయూర్ దర్శన శుభసూచకంగా భావిస్తారు. అష్టమి రోహిణి మరో పండుగ. ఇది క్రిష్ణుడి పుట్టిన రోజు. ఎంతో భక్తితో ఆచరిస్తారు. దీనినే జన్మాష్టమి అని కూడా అంటారు. మండలం, కుచేల డే, చెంబై మ్యూజిక్ పండుగ, ఏకాదశి, వైశాఖ మరియు నారాయణీయం రోజులు, ఇతర పండుగలు.

గురువాయూర్ వాతావరణం వేడి అయినప్పటికి సంవత్సరంలో ఏ సమయంలో అయినా సరే దర్శించవచ్చు. మీరు పండుగలు, ఉత్సవాలు ఆసక్తి కలవారైతే, మీ పర్యటన ఆగస్టు నుండి నవంబర్ వరకు ప్రణాళిక చేయండి. లేదా శీతాకాలంలో పర్యటించండి.

గురువాయూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

గురువాయూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం గురువాయూర్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? గురువాయూర్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు ప్రయాణం గురువాయూర్ పట్టణానికి కేరళలోని అన్ని ప్రదేశాలనుండి ప్రభుత్వ బస్ లు కలవు. ఇండియాలోని ఇతర నగరాలనుండి అంటే కొచ్చిన్, కాలికట్, పాల్ఘాట్, త్రివేండ్రం, చెన్నై, బెంగుళూర్, కోయంబ్తూర్, సేలం ల నుండి నేరు బస్ లు కూడా కలవు.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు ప్రయాణం గురువాయూర్ కు రైలు స్టేషన్ కలదు. ఇక్కడినుండి ఇరుగు పొరుగు పట్టణాలకు, నగరాలకు రైళ్ళు కలవు. సమీప రైలు జంక్షన్ త్రిస్సూర్. ఇది 27 కి.మీ.ల దూరం. ఇక్కడినుండి దేశంలోని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయు మార్గం కొచ్చిన్ లో కల నెడుంబస్సెరీ అంతర్జాతీయ విమానాశ్రయం గురువాయూర్ కు 87 కి.మీ.ల దూరం. కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ పవిత్ర పట్టణానికి సుమారు 100 కి.మీ.ల దూరంలో కలదు. టాక్సీలు, బస్ లు విమానాశ్రయం నుండి గురువాయూర్ కు తేలికా లభ్యమవుతాయి.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
05 Dec,Sun
Return On
06 Dec,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
05 Dec,Sun
Check Out
06 Dec,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
05 Dec,Sun
Return On
06 Dec,Mon