చొట్టనిక్కర – దేవాలయాల మరియు దేముళ్ళ ఆశీర్వాదాలు

కేరళ రాష్ట్ర మధ్య భాగంలోను ఎర్నాకుళం జిల్లాలోని కొ్చ్చి పొలిమేరలలోను కల చొట్టనిక్కర పట్టణం అందమైన ఒక చిన్న కుగ్రామం. లక్షలాది యాత్రికుల మనోభావాలకు ఈ గ్రామం నిదర్శనంగా నిలుస్తుంది. కేరళలో ఇది ఒక గొప్ప యాత్రా స్ధలంగా పేరుగాంచి అధిక సంఖ్యలో భక్తులను ప్రతి సంవత్సరం ఆకర్షిస్తుంది. ప్రశాంతమైన, అందమైన ఈ ప్రదేశం యాత్రికుల మనస్సులకు, శరీరాలకు కూడా ఆహ్లాదం కలిగించి వారిని ఉత్సాహ పరిచేదిగా ఉంటుంది.

పర్యాటకుడిని ఆనందపరిచేందుకు ఈ చిన్న గ్రామం అనేక ఆకర్షణలు కలిగి ఉంది. చొట్టనిక్కర దేవాలయం లేదా దీనినే చొట్టనిక్కర భగవతి దేవాలయం అని కూడా అంటారు. ఇది ఒక ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయం అనేక శతాబ్దాల కిందటిది. దీనిలో మాత భగవతి విగ్రహం ఉంటుంది. ఈ దేవాలయ శిల్పశైలి అద్భుతం. విశ్వకర్మ స్తపతిల నమూనాలో ఉంటుంది. ఈ దేవాలయంలో జరిగే చొట్టనిక్కర మాకం తోజాల్ వేడుక ప్రసిద్ధి గాంచినది. ఈ పండుగకు అనేకమంది భక్తులు, పర్యాటకులు వస్తారు.

గతంలోని త్రిరూెనితుర హిల్ ప్యాలెస్ అయిన పురావస్తు మ్యూజియం మరొక ప్రధాన ఆకర్షణ. ఈ మ్యూజియంలో ఒకప్పటి కొచ్చి రాజ్యానికి సంబంధించిన వస్తువులు ప్రదర్శంచారు. కాడు తురుతి శివ దేవాలయం మరియు పూర్ణత్రయేశ దేవాలయం లు రెండూ కూడా పర్యాటకులు తప్పక చేడదగినవి. ఎంబాంక్ సరస్సు కాడుతుిుతి శివ దేవాలయానికి సమీపంలో కలదు.

భక్తి, సంస్కృతుల సమ్మేళనం

చొట్టనిక్కర దేవాలయం మరియు ఇతర దేవాలయాలు ఈ చిన్న గ్రామంలో ఒక విశిష్ట సంస్కృతిని నెలకొ్ల్పాయి. భక్తి గీతాలు, మతపర ఉపన్యాసాలు దేవాలయాలనుండి వినపడుతూంటాయి. ఈ దేవాలయాలలో అనేక వేడుకలు, పండుగలు జరుపుతారు. సంవత్సరంలో చాలా భాగం భక్తులు వేడుకల పేరుతో దర్శిస్తూనే ఉంటారు.

ఓనం పండుగ సీజన్ లో నిర్వహించే తిరుఓనం, నవరాత్రి పండుగ, వ్రుశ్చిక మండల మమోత్సవం, త్రికార్తీక పండుగ, రామాయణ మాసం మరియు ఉత్తరం హారతి పండుగ వేడుకలు చొట్టనిక్కరలో ప్రసిద్ధి. చొట్టనిక్కర దేవాలయంలో ప్రతి ఏటా జరిగే ఉత్సవాలకు ఊరేగింపు కొరకై ఏడు పెద్ద ఏనుగులను ఉపయోగిస్తారు. ఈ ఉత్సవాన్ని ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాలి.

చక్కని వాతావరణం మరియు చక్కని రవాణా సదుపాయం

చొట్టనిక్కర సంవత్సరంలో చాలావరకు ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంటుంది. వేసవి పొడిగా ఉంటుంది. వర్షాకాలం తేమ అధికం. ఈ గ్రామ దేవాలయాలను సందర్శించాలంటే ఆగస్టు నుండి మార్చి వరకు ఉత్తమ సమయం. ప్రాంత పండుగలకు కూడా సందర్శన ప్రణాళిక చేయవచ్చు. కొచ్చి పరిసరాలలో ఉండటంతో రవాణా తేలిక. కొచ్చి పరిసరాలలోని ప్రదేశాలతోపాటు చొట్టనిక్కర ప్రణాళిక చేయవచ్చు. దీనికి సమీప రైలు మరియు విమాన సదుపాయం కొచ్చిలోనే కలదు. బస్ ల లభ్యత తరచుగానే కలదు.

ప్రశాంతమైన ప్రదేశం మరియు మీ బడ్జెట్ కు అందుబాటులో ఉండేది.

దక్షిణాది గ్రామాలలో వలెనే చొట్టనిక్కర గ్రామం చక్కటి పచ్చని ప్రదేశం. రోడ్డు ప్రయాణం చేసేవారు. పచ్చటి పొలాలను చూసి ఆనందించవచ్చు. రోడ్డు పక్కన బారులు తీరిన కొబ్బరి చెట్లు చల్లని గాలులు వీస్తాయి. ఈ గ్రామంలోని ప్రజల జీవితాలు భజనలు, ప్రార్ధనలు తో నిండి ఉంటాయి. ఈ గ్రామాన్ని 12 రోజులు వరుసన సందర్శిస్తే, జీవితం ధన్యం అవుతుందని నమ్ముతారు.

చొట్టనిక్కర చేరే పర్యాటకులు వారి ప్రయాణాన్ని ఇతర ప్రధాన ప్రయాణాలతో కలుపవచ్చు. చొట్టనిక్కర సమీపంలో మరికొన్ని ఇతర ఆకర్షణలు కలవు. ట్రావెన్ కూర్ ఫెర్టిలైజర్స్, మట్టన్ చేరి హార్బర్, వైకం మహదేవ దేవాలయం మరియు ఎర్నాకులతప్పన్ దేవాలయం వంటివి కలవు. వసతి, రవాణా ప్రతి ఒక్కరికి చవక రేట్లలోనే దొరుకుతాయి.

 

Please Wait while comments are loading...