Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కుమరకొం

కుమరకొం - అందమైన చిన్న చిన్న ద్వీపాల పొందిక!

36

మనోహరమైన బ్యాక్ వాటర్స్ పైన హాలిడే ని గడపడం ఒక మధురానుభూతి

అందమైన చిన్న చిన్న ద్వీపాల పొందిక కుమరకొం . అందరూ వెళ్లితీరాలనుకునే పర్యాటక మజిలీ కుమరకొం. కేరళ లో ని అతి పెద్ద మంచి నీటి సరస్సు గా గుర్తింపు పొందిన వెంబనంద సరస్సు వద్ద ఉన్న ఈ ప్రాంతం సహజమైన తన అంద చందాలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులని ఆకర్షిస్తోంది.

కొట్టాయం  నుండి 12 కి మీ ల దూరం లో ఉన్న ఈ ప్రాంతం, బ్యాక్ వాటర్ టూరిజం వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కుమరకొం లో ఉన్న ఈ ఆకుపచ్చని ద్వీపకల్పం, చుట్టూ అందమైన ప్రవాహాలతో, విస్తరించిన పచ్చదనంతో  పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తోంది.

అద్భుతమైన వృక్ష జాతులు మరియు జంతు జాలం

ఏపుగా పెరిగిన తాటి చెట్లు, కొబ్బరి వనాలు మరియు వరి పొలాల కి  ప్రసిద్దమైన ఈ ప్రాంతం తన  సహజమైన ప్రకృతి సౌందర్యం తో సందర్శకులకు ఆశ్చర్యానుభుతులని కలిగిస్తుంది. సమీపంలో ఉన్న సరస్సుల వల్ల ఇక్కడి నేల సారవంతమై సమృద్దిగా పచ్చని చెట్లతో కళకళ లాడుతూ ఉంటుంది. ఋతుపవనాల రాకతో చిరు జల్లులు ఈ నేలపై కురవగానే ఈ ప్రాంతం మొత్తం పచ్చని తోరణంగా మారి సందర్శకులకి కనువిందు చేస్తుంది.

పక్షులని తిలకించాలనుకునేవారికి కుమరకొం అనువైన ప్రదేశం. ఇక్కడున్న బర్డ్ సాంచురి కేరళలో నున్న సాంచురి ల లో ప్రసిద్దమైనది. విస్తృతమైన వలస పక్షులకి స్థావరం ఈ సాంచురి. అప్పుడప్పుడూ సైబేరియన్ కొంగలు కూడా ఇక్కడ కనువిందు చేస్తూ ఉంటాయి. అంతే కాదు, ఈ ప్రాంతంలో ఎన్నో రకాల సముద్రపు చేపలు దొరుకుతాయి. పెర్ల్ స్పాట్ అనబడే చేప జాతి వాటిలో ముఖ్యమైనది. వాడుకలో కొరమీను గా ఈ చేప పేరు ప్రసిద్ది.

విభిన్న సంస్కృతి, ప్రత్యేక ఆర్ధిక వ్యవస్థ

ఈ ప్రాంతం యొక్క ఆర్ధిక పరిస్థితికి దోహదపడే అంశాలలో వ్యవసాయం, ఫిషింగ్ ల తో పాటు పర్యాటక రంగం కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందువల్ల ఈ ప్రాంతం విభిన్న సంస్కృతులకి నివాసంగా మారింది. మీనాచిల్ నది గూండా నిర్మించిన జల మార్గాల సముదాయం, అనుబంధించబడిన సిస్టమ్డ్ కెనాల్స్ సేద్యానికి మరియు రవాణా వ్యవస్థకి ఎంతగానో దోహదపడుతున్నాయి. ఇవన్నీ, కుమరకొం ని ప్రధాన పర్యాటక ప్రదేశంగా ఆకర్షించడానికి ముఖ్య కారణాలు.

అరుంధతి రాయ్ చే రచింపబడిన 'ది గాడ్ అఫ్ స్మాల్ థింగ్స్'   అనే ఒకే ఒక పుస్తకం వల్ల కుమరకొం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల దృష్టిని ఆకర్షించింది. అంతే కాదు, ఈ పుస్తకం గౌరవనీయమైన బుకర్ ప్రైజ్ ని కైవసం చేసుకుని ఆధునిక యుగంలో అధికంగా అమ్ముడుపోయిన పుస్తకంగా గుర్తింపు పొందింది. కుమరకొం సమీపంలో ఉన్న అయిమనం  నేపధ్యంగా ఈ నవల నడుస్తుంది. 'ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్' పుస్తకం ప్రచురించిన తరువాత అమితంగా పర్యాటకులు ఈ ప్రాంతానికి ఆకర్షితులయ్యారు.

హౌస్ బోట్స్ లో పయనం ప్రత్యేకమైన ప్రయాణ అనుభవం

మిగిలిన పర్యాటక ప్రాంతాల నుండి కుమరకొం ని ప్రత్యేకం గా నిలిపేది ఇక్కడ ఉండే హౌస్ బోట్స్.   హౌస్ బోట్స్ లో ప్రయాణిస్తూ  నిర్మలమైన బ్యాక్ వాటర్స్ అందాలని చూసి ఆనందించేందుకు లక్షలాదిమంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని ఎక్కువగా సందర్శిస్తారు. హౌస్ బోట్స్ లో ప్రయాణానికి పర్యాటకులు వారి బడ్జెట్ కి తగినట్టుగా పేకేజెస్ ని ఎంచుకునే సౌలభ్యం కలదు. రోజు మొత్తం హౌస్ బోటు లో ప్రయాణానికి కూడా హౌస్ బోటు పేకేజెస్ అందుబాటులో ఉన్నాయి.

హౌస్ బోట్స్  లో అంటే చెక్కతో తయారు చేయబడిన విలాసవంతమైన ఓడలో ఎయిర్ కండిషనింగ్, కిచెన్, బాల్కనీ, టాయిలెట్స్, సింగిల్ నుండి ట్రిపుల్ బెడ్ రూములు వంటి అధునాతన సౌకర్యాలతో పాటు వినోదాన్ని అందించే సాధనాలు కుడా అమర్చబడి ఉంటాయి. కార్పొరేట్ కాన్ఫరెన్స్ లకి, హాలిడే లకి, హనీ మూన్ లకి ఈ హౌస్ బోట్స్ లో ప్రయాణం మధురమైన అనుభూతిని మిగులుస్తుంది. వైవిధ్యమైన ప్రయాణ అనుభూతిని పొందాలంటే  ఈ హౌస్ బోట్స్ లో ప్రయాణం చేసి తీరవలసిందే.

ఓనం పండుగ (కేరళ లో ఆగష్టు నుండి సెప్టెంబర్ వరకు జరుపుకునే అతి పెద్ద పండుగ) సమయం లో మంత్రముగ్ధుల్ని చేసే బోటు రేసులకి కుమరకొం ప్రసిద్ది. ఒడి వల్లం  , కొచ్చు ఒడి వల్లం  -  , చురులన్ వల్లం  , ఇరుట్టుకుట్టి వల్లం   మరియు చుందన్ వల్లం   వంటి వివిధ పరిమాణాలు మరియు వివిధ రకాల పడవలలో ఇక్కడ పడవ పందాలలో పాల్గొంటారు. ఇందులో గెలిచిన వారికి శ్రీ నారాయణ ఎవర్ రోలింగ్ ట్రోఫీ ని బహుమతిగా అందచేస్తారు.

అభిరుచులకు స్వర్గం

కుమరకొం లో లభించే వంటకాలలో సంపన్నమైన కేరళ సాంప్రదాయ రుచులు పర్యాటకులకి అద్భుతమైన భోజనాన్ని రుచి చుసిన అనుభూతిని కలిగిస్తాయి. ఈ ప్రాంతంలో లభించే వివిధ రకాల సీ ఫుడ్స్ ఏంతో రుచికరంగా ఉంటాయి. పర్యాటకులు ఇక్కడ లభించే వివిధ రుచులలో మునిగి తేలడానికి కొంత సమయం ఖచ్చితంగా కేటాయించాలి. కరిమీన్ పోల్లిచాతు  , చెమ్మీన్ ఫ్రై  , ప్రాన్స్ ఉలర్తియతు , ఫిష్ మొయిలీ    మరియు క్రాబ్ ఫ్రై   వంటివి అలాంటి  కొన్ని అద్భుతమైన వంటకాలు. వీటిని రుచి చూడకుండా ఏ పర్యాటకుడు కొమరకోమ ని విడిచిపెట్టరు.

పలప్పం  , మటన్ స్ట్యు  , కేరళ చికెన్ ఫ్రై  , డక్ రోస్ట్ , బీఫ్ ఫ్రై  , పుట్టు కదల , కప్ప-ఫిష్ కర్రీ   మరియు కరిమీన్ మప్పాస్  వంటి విదేశీ ప్రభావమున్న వంటకాలు కూడా పర్యాటకులని ఆకట్టుకుంటాయి. ప్రసిద్ది పొందిన పర్యాటక ప్రాంతం అవడం వల్ల  ఎన్నో రిసార్ట్స్, బడ్జెట్ హోటల్స్ మరియు హోం స్టే సౌలభ్యాలు కుమరకొం లో కలవు. మంత్రం ముగ్ధుల్ని చేసే ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, సాంప్రదాయక వంటకాల రుచులని ఆనందిస్తూ, పర్యాటకులు ప్రశాంతంగా ఈ ప్రాంతంలో గడపవచ్చు.

సందర్శనీయ అద్భుతం

హౌస్ బోట్స్ మరియు బ్యాక్ వాటర్స్ కి కుమరకొం ప్రసిద్ది చెందినా, చారిత్రక మరియు సాంస్కృతిక సందర్శనీయ ప్రదేశాలు ఈ ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి. పర్యాటక రంగం అభివృద్దికి తన వంతుగా సహాయ పడుతున్న ఈ ప్రాంతాన్ని స్పెషల్ టూరిజం జోన్ గా కేరళ రాష్ట్ర ప్రభుత్వం  గుర్తించింది. ఇక్కడున్న నీటి అద్భుతాలలో వెంబనద్ సరస్సు, అరువిక్కుజి ఫాల్స్, కుమరకొం బ్యాక్ వాటర్స్ మరియు కుమరకొం బీచ్ ప్రసిద్దమైనవి

బే ఐలాండ్ మ్యూజియం, జమ్మా మసీద్ మరియు పతిరమన్నాల్ వంటివి ఇక్కడున్న మరికొన్ని ఆసక్తికరమైన పర్యాటక ప్రాంతాలు. అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగం మీద ఇక్కడున్న మత ప్రాముఖ్యత దుష్ప్రభావం చూపలేదు.  నగరం మొత్తం అనేకమైన గుడులు మరియు చర్చ్ లు ఉన్నాయి తిరునక్కర మహాదేవ టెంపుల్, ఎట్టుమనూర్ మహాదేవ టెంపుల్, చేరాయి పల్లి లో ఉన్న సెయింట్ మేరీ చర్చ్, అతిరంపుజ్హ లో ఉన్న సెయింట్ మేరీ చర్చ్ మరియు వైకొం మహాదేవ టెంపుల్ వంటివి ఇక్కడున్న ప్రధాన మైన గుడులు మరియు చర్చ్ లు.

కుమరకొం చేరే మార్గాలు మరియు కుమరకొం వాతావరణం

రైలు, రోడ్డు మరియు వాయు మార్గం ద్వారా దేశంలో వివిధ ప్రాంతాలకి కుమరకొం అనుసంధానమై ఉంది. సరసమైన ధరలకే ఎన్నో టూర్ పేకేజెస్ ఇక్కడి కి చేరుకునేందుకు సౌకర్యం కల్పిస్తున్నాయి. వర్షాకాలం లో అత్యధిక వర్ష పాతం ఇక్కడ నమోదవుతుంది.  ట్రాపికల్ క్లైమేట్ లో ఆహ్లాదకర పర్యాటక ప్రాంతంగా ఉంటుంది.

ఆకర్షణీయమైన మడుగులు, మనోహరమైన వంటకాలు, అనేకమైన సందర్శనీయ ప్రాంతాలు, అద్భుతమైన హౌస్ బోట్స్ మరియు మంత్రముగ్ధుల్ని చేసే ఇక్కడి వాతావరణం తో కుమరకొం పర్యాటకులని ఆకర్షిస్తూ అంతు లేని ఉల్లాసాన్నిపంచుతోంది.

కుమరకొం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కుమరకొం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కుమరకొం

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? కుమరకొం

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సు (KSRTC), చుట్టు పక్కల నగరాల నుండి , ఉదాహరణకి బెంగుళూరు , కోయంబత్తూర్ ,కొచ్చి,తిరువనంతపురం ఇంకా చెన్నై నుండి పర్యాటకులు రావటానికి రాష్ట్ర బస్సు సర్వీసు మరియు ప్రైవేటు బస్సులు మంచి వసతి కలిగించాయి. కొమరకోం ని ఆసాంతం చూడాలనుకొనే పర్యాటకులు వివిధ ప్రైవేటు బస్సు ఏజెన్సి ల నుండి టూరిస్ట్ ప్యాకేజీ లను ఎంచుకోవచ్చు.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం కుమరకొం కి రైలు మార్గం లో ప్రయాణించే వారు కొట్టాయం రైలు స్టేషన్ లో దిగవచ్చు.ఇది కుమరకోమ్ కి 15 కిలో మీటర్ల దూరం లో ఉంది.కొట్టాయం రైల్వే స్టేషను కి దేశంలోని మిగతా ప్రదేశాలతో, ఉదాహరణకి చెన్నై ,బెంగుళూరు,హైదరాబాద్ , ఢిల్లీ మరియు బొంబాయి వంటి మహా నగరాలకి చక్కగా అనుసంధానమై ఉంది. రైల్వే స్టేషన్ సమీపంలోనే బస్సు అలాగే టాక్సీ సేవలు కుమరకోమ్ చేరటానికి సులభంగా లభ్యం అవుతాయి.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయు మార్గం : కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం, దీనినే నేడంబస్సి అంతర్జాతీయ విమానాశ్రయం అని కూడా అంటారు. కుమరకొం నగరానికి ఈ విమానాశ్రయం 94 కి మీ ల దూరం లో ఉంది. ఈ విమానాశ్రయంలో అన్ని ప్రముఖ నగరాల నుండి విమానాల రాకపోకలు ఉంటాయి. విమానాశ్రయంలో లోపలా బయటా టాక్సీ సేవలు కూడా లభ్యమవుతాయి. కుమరకోమ్ చేరటానికి రోజులో ఏ సమయంలోనైనా విమానాశ్రయం నుండి టాక్సీ సేవలని పొందవచ్చు.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
27 Jan,Thu
Return On
28 Jan,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
27 Jan,Thu
Check Out
28 Jan,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
27 Jan,Thu
Return On
28 Jan,Fri