Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుమరకొం » వాతావరణం

కుమరకొం వాతావరణం

అత్యుత్తమ సమయం .కుమరకోమ్  పర్యటనకి అత్యుత్తమ సమయం సెప్టెంబర్  నెల (మాన్సూన్ ముగిసిన వెంటనే) నుండి మార్చి నెల (ఎండా కాలం మొదలయ్యే  వరకు).ఈ కాలం లో వాటర్ స్పోర్ట్స్ లో ఇంకా బహిరంగ ప్రదేశాల ని సందర్శించటం, హౌస్ బోటు షికారు ,బ్యాక్ వాటర్స్ క్రూయీసింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుంది. బ్యాక్ వాటర్స్ అందుబాటులో ఉండవు కాబట్టి మాన్సూన్ సమయాన్ని మినహాయించటం ఉత్తమం. 

వేసవి

ఎండాకాలం కుమరకోమ్ లో మార్చి లో మొదలయి మే చివరి వరకు ఎండాకాలం ఉంటుంది. ఇక్కడ  ఈ కాలం మధ్యస్తు వేడిమి తో ఉంటుంది.ఎండాకాలం లో ఇక్కడి వాతావరణం 37 డిగ్రీ ల వరకు వేడెక్కవచ్చు.పర్యాటకులు ప్రదేశాలను చూసి ఆనందించగలిగినా ఈ నెలలను  పర్యటనకు అనువుగా ఉంటుందని చెప్పలేం.

వర్షాకాలం

వర్షాకాలం ఇక్కడ జూన్ లో మాన్సూన్ వల్ల భారి వర్షపాతం నమోదవుతుంది. మాన్సూన్  వర్షాల వల్ల బ్యాక్ వాటర్ ల లో ని సంతోషాన్ని అనుభవించటం , పాల్గొనటం కుదరకపోవచ్చు.ఈ కాలం లో క్రూయీసింగ్ (పడవ ప్రయాణం) అనుమతించరు. కాని పక్షులని తిలకించే వారికి మాత్రం ఇది చాలా ఉత్తమ సమయం.

చలికాలం

చలి కాలంకుమరకోమ్ లో చలికాలం నవంబర్ మొదలు నుంచి చలికాలం మొదలయ్యి ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది.. ఈ మాసాలలో పర్యాటకులు ఎటువంటి అడ్డంకులు లేకుండా బ్యాక్  వాటర్ క్రూయీసింగ్ ఇంకా బహిరంగ ప్రదేశాల ని సందర్శించటం వంటి సంతోషాలని చవిచూడొచ్చు. పర్యటనకి అనువయిన ఈ కాలం లో వాతావరణం అత్యల్పంగా  18 డిగ్రీల తో ఆహ్లాదకరంగా ఉంటుంది.