Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కొల్లాం

కొల్లాం - జీడిపప్పు, కొబ్బరి నార కి కేంద్ర నగరం

43

వర్తకానికీ, సంస్కృతి కీ పేరుగన్న నగరం కేరళ లోని కొల్లాం. ఇంగ్లీష్ పేరు "క్విలోన్" తో ఇది బాగా సుపరిచితమైన నగరం ఇది. అష్టముడి సరస్సు సమీపం లో ఉన్న తీర ప్రాంత నగరం కావడం వల్లా, కొల్లాం జిల్లా కి హెడ్ క్వార్టర్స్ కావడం వల్లా కేరళ ఆర్థిక వ్యవస్థ , కేరళ సంస్కృతి లని పరిపుష్టం చేయడం లో కొల్లాం ముఖ్య పాత్ర వహించింది. ప్రాచీన కాలం లోనే కొల్లాం కి చైనా, రోం, మధ్యాసియా లతో వాణిజ్య సంబంధాలు ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అంతర్గతంగా కూడా భారత దేశం లోని వివిధ ప్రాంతాలతో సంబంధాలు నెరపడం వల్ల కొల్లాం ప్రాచీన భారతం లోని ముఖ్య పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటిగా మారింది. ఈనాడు జీడిపప్పు కి ప్రపంచం లో అతిపెద్ద ఉత్పత్తిదారు గా, ఎగుమతిదారుగా పేరు పొందిన ఈ నగరాన్ని స్థానికులు "జీడిపప్పుల నగరం" గా పిలుచుకుంటుంటారు. అలాగే ఇక్కడ ఎదుగుతున్న నార తయారీ పరిశ్రమ నగరాన్ని కుటీర పరిశ్రమలకి కేంద్రం గా మార్చింది.

సాంస్కృతిక నేపథ్యం

ప్రాచీన కాలం నుండే సాంస్కృతిక కేంద్రం గానూ, అధ్యయన కేంద్రం గానూ ఉండడం వల్ల కొల్లాం నగరానికి సాంస్కృతికంగా ప్రాచీన మూలాలు ఉన్నాయి. నగరానికి ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా దక్షిణ భారత దేశం లోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, పండితులు నగరాన్ని సందర్శించేవారు. అలాగే సాహిత్యరంగ అభివృద్దికి కూడా నగరం తోడ్పడింది. 14 వ శతాబ్దం లో మళయాల సాహిత్యం లో వచ్చిన అత్యుత్తమ రచనలు "లీలెతిలకం" మరియు "ఉన్నునీలి సందేశం" ఈ నగరం నుంచి ఆవిర్భవించినవే.

కేరళ కే సొంతమైన నాట్య రూపం "కథాకళి", కొట్టారక్కర తాంపురం ప్రయత్నాల కారణంగా ఇక్కడ నూతన రూపాల్ని సంతరించుకుంది. కె.సి. కేశవ పిళ్ళై, పరవూర్ కేశవన్ ఆసన్ మరియు ఇ.వి.కృష్ణ పిళ్ళై వంటి పండితులు, రచయితల కారణంగా కొల్లాం నగరం కేరళలోనే కాక, కేరళ బయట కూడా ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది.

పండగల సంరంభం

ఏటేటా లక్షలాది ప్రయాణీకులని ఆకర్షించే ఉత్సవాలకీ, పండగలకీ కొల్లాం పుట్టిల్లు. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి ల మధ్య జరిగే హస్తకళల ఉత్సవం లో దేశం లోని వివిధ ప్రాంతాల హస్త వృత్తి కళాకారుల చేత చేయబడ్డ చేతి పనులు ప్రదర్శింపబడతాయి. అలాగే ప్రేక్షకులకి కనువిందు చేసే పడవ రేసులు, ఏనుగు ఉత్సవాలు నగరానికి మరింత పేరు తెచ్చాయి.

అష్టమి రోహిణి, ఓనం మరియు విషు లని కొల్లాం లో ఎంతో ఉత్సాహం తో జరుపుకుంటారు. ప్రతియేడూ జూన్ లో జరిగే ఓచిరకల్ (కంచె పోరాటం) కూడా తన విలక్షణ తో సందర్శకులని ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతం లో జరుపుకునే ఇతర పండగలు మరమడి మల్సరం (ఎద్దుల పోటీల ఉత్సవం), కొల్లాం పూరం, పారిప్పల్లి గజమేళా, అనయడి ఏనుగు సంబరం మరియు పన్మన పూరం యావత్ భారత దేశ దృష్టి ని ఆకర్షించాయి.

అసమానమైన పర్యాటక అనుభవం

కొల్లాం లోని విభిన్నమైన పర్యాటక ప్రాంతాలు ఏడాది పొడుగునా సందర్శకులని ఆకర్షిస్తాయి. కొల్లాం బీచ్, తంగస్సేరి బీచ్, అడ్వెంచర్ పార్క్ మరియు తిరుముల్లవరం బీచ్ సందర్శకులని సేద తీరుస్తాయి. అష్టముడి సరస్సు , మున్రో ద్వీపం, నీండకర పోర్ట్, అలుంకడవు నౌక నిర్మాణ కేంద్రం మరియు సస్తంకోట్ట సరస్సు నీటి యొక్క అద్భుత సౌందర్యాన్ని సాక్షాత్కరిస్తాయి. రామేశ్వర గుడి, అచెంకయిల్ మరియు మయ్యనాడ్ లు చారిత్రక ప్రాముఖ్యత కూడా కలిగిన పర్యాటక ఆకర్షణలు.మాతా అమృతానందమయి దేవి భక్తుల యాత్రాకేంద్రం అమృతపురి ఆశ్రమం, ఏటా లక్షలాది మంది భక్తుల ని ఆకర్షిస్తుంది. ఆర్యంకవు, చవర, కొట్టారక్కర, ఓచిర మరియు కరునాగప్పల్లి ఈ ప్రాంతం లోని ఇతర ముఖ్య సాంస్కృతిక మత కేంద్రాలు.

అలరించే రుచులు - అహ్లాదకరమైన వాతావరణం

కొల్లాం సీ ఫుడ్స్ కి బాగా ప్రఖ్యాతి గాంచిన నగరం. ఇక్కడి రెస్టారెంట్లలో చేపలు, రొయ్యలు, ఎండ్ర కాయల వంటకాలు కేరళ స్థానిక రుచులతో సందర్శకులని ఆకట్టుకుంటాయి. తిరువనంతపురం, పాతనంతిట్ట, అలప్పుళ జిల్లాలకి సరిహద్దుల్లో ఉండటం వల్ల కొల్లాం నగరం చేరుకోవడానికి చక్కని రైలు మరియు రోడ్డు సౌకర్యాలున్నాయి. ఏడాది పొడుగునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందిక్కడ. ఇక ఋతు పవనాల జల్లులు ఈ ప్రాంత అద్భుత సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. ఇక్కడ అనేక మార్కెట్ ప్రాంతాలు ఉండటం వల్ల ఈ నగరం లో కొని కొన్న్నింటిని ఇంటికి తీసుకెళ్ళాలనుకునే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. విలక్షణమైన చరిత్ర, అద్భుతమైన వాతావరణం, విస్తృతమైన పర్యాటక ప్రాంతాలు - వెరసి ఒక భిన్నమైన పర్యాటక అనుభవం కోరుకునే వారికి ఇది ఒక చక్కటి ఆప్షన్.

కొల్లాం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కొల్లాం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కొల్లాం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కొల్లాం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా: మూడు ప్రధాన జాతీయ హైవేలు కొల్లాం జిల్లా ద్వారా వెళ్ళడం వల్ల కొల్లాం కి చక్కటి రోడ్డు కనెక్టివిటీ ఉంది. పొరుగు జిల్లాలైన తిరువనంతపురం, పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం ల నుంచి బస్సులు నడుస్తూనే ఉంటాయి. ఇక ప్రైవేట్ లగ్జరీ బస్సులు కొల్లాం నుంచి దక్షిణ భారతదేశం లో ని ముఖ్య నగరాలైన బెంగళూరు, చెన్నై, కొచ్చి, కోయంబత్తూర్, పాండిచ్చేరి ల కి నడుస్తూనే ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా: కొల్లాం రైల్వే స్టేషన్ కేరళ లో ని అతిపెద్ద స్టేషన్లలో ఒకటి. దీనికి అన్ని ప్రాంతాల నుంచి చక్కటి కనెక్టివిటీ ఉంది. కేరళ లో ని అన్ని పట్టణాల నుండి, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, లాంటి నగరాలను ఎక్కువ సంఖ్య లో కొల్లాం కి రైళ్ళు నడుస్తున్నాయి. రైల్వే స్టేషన్ నుంచి టాక్సీ, రిక్షాలు దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానం ద్వారా: కొల్లాం కి ఎయిర్ పోర్ట్ లేదు. కొల్లాం కి 70 కి.మి. దూరం లో ఉన్న తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా టక్సీ ద్వారా గానీ లేదా బస్ ద్వారా గానీ కొల్లాం చెరవచ్చు. భారత్ లో ని అన్ని పెద్ద నగరాల నుంచీ, విదేశాల్లోని కొన్ని ముఖ్య నగరాల నుంచీ తిరువనంతపురం కి విమాన సదుపాయం ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed