కొల్లాం కి 27 కి.మి. దూరం లో ఉన్న ఈ ద్వీపానికి రోడ్డు ద్వారా లేక నీటి ద్వార వెళ్ళొచ్చు. స్థానికంగా మున్రో తురు అని పిలుచుకునే ఈ మున్రో ద్వీపం నిజానికి 8 చిన్న ద్వీపాల సముదాయం. ఇక్కడ కాలువలు నిర్మించి, నీటి ప్రయాణానికి వీలుగా కయ్యి నీటిని అనుసంధానం చేసిన కల్నల్ జాన్ మున్రో అనే బ్రిటిష్ అధికారి కారణంగా దీనికి ఈ పేరు వచ్చింది.
రమణీయమైన అందం, విస్తృతమైన సందర్శనావకాశాల కారణంగా ఇవాళ మున్రో ద్వీపం సందర్శకులని బాగా ఆకర్షిస్తోంది. ఈ ద్వీపం లో మూలచంతార గుడి, కల్లువిల గుడి తో పాటు 1878 లో నిర్మించిన ప్రాచీన చర్చ్ కూడా ఉంది. ద్వీపం లో ని పాళ్యం తురుత్ లోని సౌందర్యం, నిర్మలత్వం పర్యాటకులని ఆకర్షిస్తోంది.
అష్టముడి నీరు కల్లడ నది తో కలిసే ప్రదేశం లో ఈ ద్వీపం ఉంది. సెలవులు గడపడానికి ఇది చక్కటి ప్రదేశం. పక్షుల్ని చూడటం, చేపలు పట్టడం, ప్రదేశాలు చూడటం వంటి అనేక పనులు చేసే వీలుందిక్కడ. నార పరిశ్రమ కి ఈ స్థలం ప్రసిద్ది కావడం తో నార తయారీ ని కూడా సందర్శకులు చూడవచ్చిక్కడ.