Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొల్లాం » వాతావరణం

కొల్లాం వాతావరణం

కొల్లాం సందర్శించడానికి సరైన సమయం: కొల్లాం సందర్శించడానికి నవంబర్ మొదలుకుని మార్చ్ వరకు చాలా చక్కటి సమయం. పండగలు, ఉత్సవ వాతావరణం ఉండే ఈ నెలల్లో కొల్లాం సందర్శించడం మంచిది. వేసవి తాపం ఎక్కువ గా ఉండే ఏప్రిల్, మే నెలలు, విస్తారమైన వర్షాలుండే జూన్, జూలై నెలల్లో వెళ్ళక పోవడం మంచిది.

వేసవి

వేసవి కాలం: కొల్లాం అరేబియా సముద్రానికి సమీపాన ఉండటం వల్ల ఉష్ణ మండల వాతావరణాన్ని కలిగి ఉంది. మార్చ్ నుండి మే చివరి దాకా వేసవి ఉంటుంది. అయితే ఇక్కడ వేసవి ఉష్ణోగ్రతలు మధ్యస్థంగా ఉంటాయి. గరిష్టంగా 34 డిగ్రీల వరకు వెళ్తుంది. వేసవి లో కొల్లాం వెళ్ళాలనుకునే సందర్శకులు కాటన్ దుస్తులు, సన్ గ్లాసెస్ తీసుకెళ్ళాలి.

వర్షాకాలం

వర్ష కాలం: నైరుతి ఋతుపవనాల వల్ల జూన్ జూలై లో విస్తారమైన వర్షాలు పడతాయి. జూన్ నుంచి సెప్టెంబర్ ప్రారంభం వరకు ఇక్కడ వర్ష కాలం. అయితే అక్టోబర్, నవంబర్ లోనూ ఈశాన్య ఋతుపవనాల కారణంగా కొద్దిపాటి వర్షాలు పడతాయి. వర్షాలు ఎక్కువగా పడే నెలల్లో పడవ ప్రయాణాలు, బీచ్ సందర్శనలు మంచివి కావు.

చలికాలం

చలికాలం: కొల్లాం లో డిసెంబర్ లో చలికాలం ప్రారంభం అయి ఫిబ్రవరి దాకా వుతుంది. డిసెంబర్ తర్వాతి నెలలు పొడిగా ఉంటాయి. చలికాలం కూడా కొద్దిపాటి జల్లులు ఉంటాయి. పడవ ప్రయాణాలు, బీచ్ సందర్శనలు వంటివాటికి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి సరైన సమయం.