Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పొన్ముడి

పొన్ముడి - స్వర్ణ శిఖరం

20

పొన్ముడి అంటే స్వర్ణ శిఖరం అని అర్ధం చెపుతారు. ఈ ప్రదేశం కేరళలోని తిరువనంతపురం జిల్లాలో కల ఒక హిల్ స్టేషన్. సముద్ర మట్టానికి సుమారు 1100 మీ.ల ఎత్తున పడమటి కనుమల శ్రేణిలో కలదు. ఆహ్లాదకర వాతావరణం, సుందర ప్రదేశాలు పొన్ముడిని ఒక వేసవి విశ్రాంతి ప్రదేశంగా మార్చాయి.

పొన్ముడి హిల్ స్టేషన్ కు తిరువనంతపురం నుండి ఒక సన్నని పాము మెలికల మార్గంలో సుందరమైన ప్రదేశాలను చూసుకుంటూ రోడ్డు మార్గాన ప్రయాణించవచ్చు. ఎటువైపు చూసినా పచ్చని ప్రదేశాలతో మార్గం బాగుంటుంది. కొద్దిపాటి సాహసాలు చేయాలనుకునేవారికి ఈ ప్రదేశంలో ట్రెక్కింగ్ మరియు హైకింగ్ ప్రదేశాలు కూడా కలవు. పొడవైన మరియు కొసలు తేలిన మలుపులు మీలో ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తాయి.

ప్రకృతి యొక్క పరవశాలు 

ఈ పర్వత ప్రాంతంలోని విహారంలో మీకు ఎన్నో లోయలు, సరస్సులు, సుగంధ ద్రవ్యాల తోటలు కనపడతాయి. పొన్ముడిలో ప్రధానంగా గోల్డెన్ వ్యాలీ, పెప్పర వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మిని జూ చూడవలసిన ప్రదేశాలు. పడమటి కనుమలలోని ఆగస్త్య కూడం ఎత్తైన శిఖరం. పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. మీన్ ముట్టి జలపాతాలు మరొక ఆకర్షణ. వర్షాకాలంలో ఈ జలపాతాలు మరింత అధికంగా ప్రవహిస్తూ మరిన్ని చిన్న జలపాతాలను, చిన్న ఏరులను ఏర్పరుస్తాయి.

సహజ అందాలకే కాక పొన్ముడి ఆయుర్వేద ఔషధ చికిత్సలకు కూడా ప్రసిద్ధి. ఈ ప్రదేశంకు తిరువనంతపురం నుండి రోడ్డు మార్గంలో తేలికగా చేరవచ్చు. శీతాకాలం ఈ ప్రాంత సందర్శన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అనేక జలపాతాలు, పచ్చని ప్రదేశాలు, మైమరపించే ప్రకృతి సొగసులు మిమ్మల్ని స్వాగతిస్తాయి. అన్వేషణలకు, సాహస క్రీడలకు శీతాకాలంలో ఈ ప్రాంత సందర్శన సూచించదగినది. జలపాతాలు, పచ్చటి ప్రదేశాలు, ట్రెక్కింగ్ అవకాశాలు వంటి వాటితో పొన్ముడి పర్యాటకుడి విశ్రాంతి సెలవుల కోరికలకు అనుకూల ప్రదేశంగా ఉంటుంది.

పొన్ముడి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పొన్ముడి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పొన్ముడి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పొన్ముడి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం తిరువనంతపురం నుండి పొన్ముడికి దూరం చాలా తక్కువ. బస్సు ప్రయాణం చవక మరియు సౌకర్యవవంతం. తిరువనంతపురం నుండి బస్సులు తరచుగా నడుస్తాయి. ప్రభుత్వ మరియు ప్రయివేట్ బస్సులు కూడా కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం తిరవనంతపురం సెంట్రల్ రైలు స్టేషన్ పొన్ముడి కి సమీపం. ఈ రైలు స్టేషన్ నుండి ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. రైలు స్టేషన్ నుండి పొన్ముడికి టాక్సీలలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం పొన్ముడికి 65 కి.మీ.ల దూరంలోని తిరువనంతపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడినుండి ఇండియాలోని అన్ని నగరాలకు విమానాలు నడుస్తాయి. విమానాశ్రయం నుండి టాక్సీలలో పొన్ముడి చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Jun,Mon
Check Out
02 Jun,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue