పొన్ముడి పర్వత ప్రాంతం దర్శించే పర్యాటకులకు మిని జూ మరొక ఆకర్షణ. ఈ జూ పొన్ముడి పట్టణానికి సమీపంగానే ఉంటుంది. ట్రెక్కింగ్ లో చేరుకోవచ్చు. ఈ మిని జూ లో బారాసింఘా లేదా స్వాంప్ డీర్ ప్రధాన ఆకర్షణ. అడవి పక్కనే ఉండటం వలన ఈ జూలో కావలసినన్ని రకాల జంతువులు, మొక్కలు కలవు. ఈ జూ పిల్లలకు మంచి ఆనందం కలిగిస్తుంది. సంవత్సరం పొడవునా ఇది తెరిచే ఉంటుంది. ఫొటోగ్రఫీ, విశ్రాంతి నడక, ట్రెక్కింగ్, హైకింగ్ వంటివి ఆచరించవచ్చు.