Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» వాగమోన్

వాగమోన్ - ప్రకృతి మాత ఆశీస్సులు లభించే ప్రదేశం

46

 

వాగమోన్ కేరళలోని ఎడుక్కి జిల్లా మరియు కొట్టాయంల సరిహద్దులలో కలదు. ఈ ప్రదేశం పర్యాటకులకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ప్రత్యేకించి కొత్త జంటలకు, ప్రయివసీ కోరే వారికి అనుకూలం. పచ్చటి మైదాన ప్రాంతాలు, నీలపు కొండలు, పారే నదులు, ఉరికే జలపాతాలు, తాజా గాలి దట్టమైన అడవులు అన్ని చేరి వాగమోన్ ను ఒక అద్భుత పర్యాటక ప్రదేశం చేశాయి. తంగల్ కొండలు, మురుగన్ హిల్ మరియు కురిసుమాల వంటివి ఈ చిన్న పట్టణానికి మరింత శోభ తెచ్చి పెట్టాయి.

వాగమోన్ లో ఏం సందర్శించాలి?

వాగమోన్ సుందర ప్రదేశమే కాక, పర్యాటకుడికి ఎన్నో ప్రదేశాలు ఇతరంగా కూడా చేసేలా చేస్తుంది. రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, మౌంటెనీరింగ్ మరియు పారా గ్లైడింగ్ వంటివి ఇక్కడ చేయవచ్చు. మీరు సాహసికులు కాకుంటే, విశ్రాంతిగా కూర్చొని పరసరాల అందాలను, వివిధ రకాల పువ్వులను, తోటలను చూస్తూ ఆనందించవచ్చు. అందమైన ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి సుమారు 1,100 మీటర్ల ఎత్తున కలదు. వాగమోన్ ను స్కాట్ లాండ్ ఆఫ్ ఏషియా గా వర్ణిస్తారు. ఇండియాలో గల అత్యంత ఆకర్షణీయ 50 ప్రదేశాలలో ఈ ప్రదేశం ఒకటిగా నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ పేర్కొంది.

వాగమోన్ ప్రాంతాన్ని సుందర నగరంగాను తేయాకు తోటలకు అనుకూలంగాను మొదటగా భావించింది బ్రిటీష్ వారు. వారి తర్వాత ఈ ప్రదేశానికి క్రిస్టియన్ మిషనరీలు వచ్చి కురిసుమలలో తమ స్ధావరాలు ఏర్పరచుకొన్నారు.

వాగమోన్ చేరుట ఎలా?

వాగమోన్ కొట్టాయంనుండి 65 కి.మీ.ల దూరంలో కలదు. దీనికి సమీప విమానాశ్రయం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం మరియు రైలు స్టేషన్ కొట్టాయం.

దీని పరిసర ప్రాంతాలలో అనేక మంచి రిసార్టులు కలవు. ధెక్కడీ, పీర్ మేడ్ మరియు కులమావు వంటివి వాగమోన్ నుండి తేలికగా చేరగల పర్యాటక ప్రదేశాలు. ఈ ప్రదేశం సంవత్సరం పొడవునా ఆహ్లాదకర వాతావరణం కలిగి ఉంటుంది.

 

వాగమోన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

వాగమోన్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం వాగమోన్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? వాగమోన్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం వాగమోన్ రోడ్డు మార్గంలో కూడా వెళ్ళవచ్చు. సమీప ప్రాంతాలనుండి బస్ లలో వాగమోన్ చేరవచ్చు. లేదా టాక్సీలలో కూడా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం వాగమోన్ కు సమీప రైలు స్టేషన్ కుట్టికానాం ఇది 22 కి.మీ.ల దూరంలో కలదు. ఇంకనూ, సమీప రైలు స్టేషన్లు పాలాయి 33 కి.మీ.లు మరియు తోడుపూజా 39 కి.మీ.ల దూరంలో, కుమిలీ 45 కి.మీ.ల దూరంలో కొట్టాయం 65 కి.మీ.ల దూరంలో కూడా కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం వాగమోన్కు సమీప విమానాశ్రయం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయంలో జాతీయ అంతర్జాతీయ విమానాలు నడుస్తాయి. కొచ్చిన్ నుండి వాగమోన్ కు 107 కి.మీ.ల దూరం కలదు. కనుక అక్కడినుండి ఈ హిల్ స్టేషన్ కు బస్ లేదా టాక్సీలలో రెండున్నర గంటలలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Jun,Mon
Check Out
02 Jun,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue