కురిసుమల హిల్ ను మౌంటెన్ ఆఫ్ ది హోలీ క్రాస్ అని కూడా అంటారు. ఇది వాగమోన్ కు 10 కి.మీ.ల దూరంలో కలదు. ప్రసిద్ధి చెందిన ఈ కొండ క్రిస్టియన్లకు యాత్రా స్ధలం. మరియు పాల ఉత్పత్తి కేంద్రాలకు నిలయం. కురిసుమల కొండ చుట్టూ పచ్చటి తేయాకు తోటలు దట్టమైన అటవీ ప్రదేశాలు ఉండి, కొండను మరింత ఆకర్షణీయంగా ఉంచాయి.
ఈ కొండనుండి మీరు మురుగన్ పారా చూడవచ్చు. దూర ప్రాంతాలనుండి ఇక్కడకు చాలామంది, ట్రెక్కింగ్, కేంపింగ్, మరియు పారాగ్లైడింగ్ ల కొరకు వస్తారు. కురిసుమాల ఆశ్రమం కొరకు చాలామంది సందర్శకులు వస్తారు. గుడ్ ఫ్రైడే నాడు భక్తులు హోలీ క్రాస్ ధరించి ఈ కొండపైగల ఆశ్రమానికి వస్తారు.
కొండపైకి వెళ్ళే దోవలో ఐరోపా శిల్ప శైలిలో నిర్మించబడిన పురాతన ఇల్లు ఒకటి కలదు. దీని సమీపంలో మానవ నిర్మిత సరస్సు ఒకటి కలదు. ఇల్లు మరియు సరస్సు లారీ బేకర్ చే ప్రణాళిక చేయబడ్డాయి. ఆశ్రమ సన్యాసులు నిర్వహించే డైరీ ఫారములు, ఇండో స్విస్ ప్రాజెక్టు లు కూడా చూడవచ్చు.