Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వాగమోన్ » వాతావరణం

వాగమోన్ వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం ఆహ్లాదకర వాతావరణం కల వాగమోన్ ను సంవత్సరంలో ఎపుడైనా సందర్శించవచ్చు. వేసవి ఈ ప్రాంత సందర్శనకు సరైన సమయం. ఈ సమయంలో ప్రకృతి సైతం పరవశించిపోతూంటుంది.  

వేసవి

 వేసవి వాగమోన్ లో వేసవి కాలం చాలా తక్కువ, మూడు నెలలు అంటే మార్చి నుండి మే వరకు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి ఉష్ణోగ్రతలు గరిష్టం 25 డిగ్రీలు కనిష్టం 10 డిగ్రీ సెల్షియస్ గా ఉంటాయి. ఈ సమయంలో వాగమోన్ సందర్శించవచ్చు.  

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. వర్షాలు నిరంతరం అధికంగా ఉంటాయి కనుక, వాగమోన్ సందర్శన ఈ కాలంలో సూచించదగినది కాదు.  

చలికాలం

శీతాకాలం శీతాకాలం ఈ ప్రదేశంలో అతి చల్లగా ఉంటుంది. కనిష్ట ఉష్నోగ్రత 10 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా వుంటాయి. శీతాకాలం అధిక సమయం కలిగి ఉంటుంది. అక్టోబర్ లో మరింత అధిక చలి. ఫిబ్రవరి వరకు ఈ పరిస్ధితి కొనసాగుతుంది. రాత్రి వేళ 0 డిగ్రీలకు సైతం ఉష్నోగ్రత పడిపోతుంది. ఈ సమయంలో వాగమోన్ సందర్శించేవారు ఉన్ని దుస్తులు తప్పక తీసుకు వెళ్ళాలి.