Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» మలప్పురం

మలప్పురం - నదులు, సంస్కృతులు

15

కేరళ లోని ఉత్తర ప్రాంతపు జిల్లా అయినటువంటి మలప్పురం గొప్ప సంస్కృతికి, చారిత్రిక ప్రాధాన్యతకి, విశిష్టమైన వారసత్వ సంపదకి ప్రసిద్ధి. చిన్న కొండలతో , గుట్టలతో అలంకరించబడిన మలప్పురం ప్రాంతం సార్ధక నామధేయి (మలయాళంలో మలప్పురం అనగా పర్వత శిఖరం). ప్రాచీన , ఆధునిక సంస్కృతులను కలిపి అల్లిన చరిత్ర కలిగి ఉన్న మలప్పురం ప్రాంతం సంస్కృతికి, మతానికి, ఆర్ధిక వ్యవస్థకి మాత్రమే కాక కేరళ పర్యాటక రంగానికి కుడా విస్తృతంగా దోహదపడింది. "గల్ఫ్" వలస జనాభా వలన కలిగిన మునుపెన్నడూ ఎరుగని ఆర్థిక వృద్ధి దేశ ఆర్ధిక వేత్తల దృష్టిని ఈ జిల్లా ఆకర్షించింది.

చలియార్, భరతపుళ, కదలుండి అనే మూడు నదులు ప్రవాహం మలప్పురం నేలని , సంస్కృతిని సుసంపన్న చేస్తున్నాయి. గత రోజుల్లో కాలికట్ కి చెందిన జామోరిన్స్ రాజుల బలమైన సైన్యానికిది ప్రధాన కేంద్రం గా ఉంది.

ఖిలాఫత్ ఉద్యమానికి, మోపిల తిరుగుబాటుకి జన్మస్థలమై భారత జాతీయ చరిత్ర లో ముఖ్య భూమిక పోషించింది. ఒప్పాన అనబడే మహమ్మదీయ నాట్యకళకి ఇది పుట్టినిల్లు.

అనేక సంప్రదాయాలు , ప్రత్యేక ఆకర్షణలు

మలప్పురం లోని చిన్న పట్టణాలు కేరళ సంస్కృతిక, రాజకీయ, సాహిత్య సంప్రదాయాలకి సాటిలేని విధంగా దోహదపడ్డాయి. మధ్యయుగ కాలంలో "తిరునవయ" వైదిక విద్య కు కేంద్రంగా ఉంది. సాంప్రదాయ ఆయుర్వేద వైద్య వ్యవస్థ "కొట్టక్కళ్" లో మొదలయ్యింది. పొన్నాని (ప్రాచీన మహమ్మదీయ విద్యా కేంద్రం) నీలంబుర్ ( టేక్ పట్టణం) మలప్పురానికి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించాయి.

మలప్పురం లో కదలుండి పక్షి సంరక్షణ కేంద్రం, కేరళదేశ్ పురం ఆలయం, తిరునవయ లాంటి సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ మలప్పురం జుమా మసీదు, మన్నూర్ శివాలయం, తిరుప్పురంతక దేవాలయం, వెట్టకోరుమకన్ దేవాలయం లాంటి గుళ్ళు,మసీదులు కలవు. కొట్టక్కున్ను పర్వత ఉద్యానవనం, బియ్యం సరస్సు, శాంతితీరం నదీతీర ఉద్యానవనం వేలాది మంది పర్యాటకులని ఇక్కడికి రప్పిస్తున్నాయి.

మలప్పురం రహదారి, రైలు, వాయు మార్గాల ద్వారా అనుసంధానించబడటం వల్ల సంవత్సరం పొడుగునా యాత్రికుల ఎటువంటి వ్యయప్రయాసలు లేకుండా చేరుకోవచ్చు. మధ్యస్థ వాతావరణం కలిగి పర్యటన కు అనుకూలంగా ఉంటుంది. మహమ్మదీయ జనాభా అధికంగా ఉండటంవల్ల అరబిక్, కేరళ సంప్రదాయ రుచుల మేలు కలయికగా ఒక విశిష్ట భోజన సంస్కృతి ఇక్కడ వెల్లివిరిసింది. ప్రాకృతిక సౌందర్యం, సంఘటనాత్మక చరిత్ర, అసాధారణ వంటకాలు ఇక్కడ ప్రకృతి ఆరాధకులని, చరిత్ర ప్రేమికులని, భోజన ప్రియులని సరి సమానంగా సంతృప్తి పరుస్తాయి.

మలప్పురం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మలప్పురం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మలప్పురం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మలప్పురం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం కాలికట్ , పాలక్కడ్ లాంటి అన్ని పొరుగు జిల్లా లనించి మలప్పురం కి చక్కటి రోడ్డు మార్గం ఉంది. మలప్పురం చేరుకోటానికి మరియు మలప్పురం నించి బయల్దేరడానికి ఎన్నో కేరళ రాష్ట్ర బస్సులు , ప్రైవేటు బస్సులు ఉన్నాయి. జిల్లా లోని పట్టణాలని చుట్టటానికి బస్సులే పొదుపైన మార్గం. బెంగుళూరు, కొచ్చి, తిరువనంతపురం నించి లగ్జరీ బస్సు లు కూడా ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం మలప్పురం జిల్లా లోఅంగడిపురం, తిరుర్, తానూర్ , కుట్టిప్పురం, పరప్పనంగడి మొదలుకుని అనేక చిన్న రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కేరళ లోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలని కలిపే ఎన్నో రైళ్ళు ఈ స్టేషన్ల గుండా వెళ్తాయి. తిరువనంతపురం, కొచ్చి, త్రిస్సూర్, కొట్టాయం నించి తరచు రైళ్ళు ఉన్నాయి. రైలు లో ప్రయాణించేవారు 50 కి.మీ ల దూరంలో ఉన్న కాలికట్ కి ముందుగా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం మలప్పురం కి అతి సమీపం లోని విమానాశ్రయం కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం (కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం గా కూడా పరిచితం) మలప్పురం నడిబొడ్డుకి సుమారు 25 కి.మీ ల దూరంలో ఉంటుంది. కాలికట్ విమానాశ్రయానికి భారత దేశం లోని ప్రధాన నగరాల నించి, మధ్య ప్రాశ్చ్యం లోని కొన్ని నగరాల నించి విమాన సదుపాయం ఉంది . వాయు మార్గం గుండా చేరే వారు మలప్పురం లోని అన్ని ముఖ్య పట్టణాలకి టాక్సీ సేవలు ఉపయోగించుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat