బెకాల్ - నిశ్శబ్ద నీటి లో అత్యదిక విశ్రాంతి...!

కేరళ లోని కాసరగోడ్ జిల్లాలలో పల్లికారే అనే ప్రదేశంలో అరేబియా కోస్తా తీరంలో బెకాల్ ఒక చిన్న పట్టణం. దీనికి ఈ పేరు బలియాకులం అనే పేరు నుండి వచ్చింది. బలియకులం అంటే పెద్ద ప్యాలెస్ అని అర్థం. స్థానికుల నమ్మకాల మేరకు పూర్వంలో ఇక్కడ ఒక పెద్ద భవనం ఉండేది. అనేక ఆకర్షణలు కల బెకాల్ పట్టణం ఒక ప్రధాన పర్యాటక ప్రదేశం.

ఈ చిన్న పట్టణం దాని సహజ అందాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది. బెకాల్ పట్టణం దాని ఆతిధ్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్థానికుల తయారు చేసే పాయసం తాగటం మరచిపోకండి. బెకాల్ లో ప్రతి ఒక్క దేవాలయం వివిధ కుటుంబాలకి చెందినది. ప్రతి గుడి కూడా వివిధ దైవాలకి చెంది వుంటుంది. సంవత్సరం మొదటి భాగంలో కనుక ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే, ఇక్కడ ప్రధానంగా జరిగే తెయ్యం జాతర కూడా చూడవచ్చు.

బెకాల్ కోట చారిత్రకంగా మరియు పురావస్తు రీత్యా ప్రాముఖ్యత కలది. ఇది అతి పెద్ద కోటలలో ఒకటి. దీనిని భారత ప్రభుత్వ పురావస్తు శాఖ చక్కగా నిర్వహిస్తోంది. కోట పరిసరాలు సముద్రానికి సమీపంగా ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. బెకాల్ కోట లోపల ఒక ట్రావెల్ బంగళా కలదు. దీనిని కేరళ ప్రభుత్వ పి డబ్లుయ్ డి శాఖ నిర్వహిస్తోంది.

ఇతర ఆకర్షణలు అంటే ఒక హనుమాన్ టెంపుల్ మరియు టిప్పు సుల్తాన్ చే స్థాపించబడిన ఒక పురాతన మసీదు కలవు. ఈ చిన్న పట్టణం లో కల సుమారు ఒక డజను కోట లు దాని చారిత్రక ప్రాధాన్యతను చాటుతాయి.

 

Please Wait while comments are loading...