కన్నూర్ - ప్రకృతితో సంస్కృతి మిళితమైన ప్రదేశం

కేన్నోర్ అని అంగ్లీకరించబడిన కన్నూర్, గొప్ప వారసత్వానికి, శక్తివంతమైన ప్రసిద్ధికి ప్రాచుర్యం పొందింది. ఇది కేరళ లో ని ఉత్తరం లో ఉన్న జిల్లా. పశ్చిమ కనుమలు మరియు అరేబియన్ సి తో సరిహద్దును పంచుకుంటున్న ఈ ప్రాంతం, సంస్కృతీ సంప్రదాయాలను మరియు సంవృద్దిగా ఉన్న సహజమైన ప్రకృతి సౌందర్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రాచీన కాలం లో  మలబార్ ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక, సాంప్రదాయ మరియు వాణిజ్య కేంద్రాలుగా ఈ జిల్లా వ్యవహరించేది.

ఎందరో భిన్న సంస్కృతులు కలిగిన పరిపాలకులు స్థావరంగా ఈ ప్రాంతాన్ని చేసుకోవడం వల్ల విభిన్న సంస్కృతులు ఈ ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. సోలోమన్ రాజు యొక్క షిప్స్ కన్నూర్ తీరంలో బైబ్లికల్ కాలంలో నడవబడినట్టు చరిత్ర చెబుతోంది.  డచ్, పోర్చుగీసు, మైసూరు సుల్తానేట్, మరియు బ్రిటిష్ వారిచే సుదీర్ఘమైన దండయాత్రల ప్రయోగం ఈ ప్రాంతం యొక్క చరిత్రని అసాధారణంగా తీర్చిదిద్దింది.

జానపదలు, సముద్రపు అందాలు ఈ ప్రాంతం సొంతం

ఈ ప్రాంతం జానపద కళలకి, మగ్గాలకి ప్రసిద్ది చెందింది. తేయట్టం అనబడే ప్రదర్శన ద్వారా ఇక్కడున్న ఆలయాలకు ఎంతో మంది పర్యాటకులు మరియు భక్తులు ఆకర్షితులవుతున్నారు. వైవిధ్యమైన వస్త్ర పరిశ్రమ కూడా పర్యాటకులని ఆకర్షించడానికి తనవంతు పాత్ర పోషిస్తోంది. సుందరేశ్వర టెంపుల్, కొట్టియూర్ శివ టెంపుల్, ఊర్పజ్హస్సి కావు టెంపుల్, శ్రీ మవిలయిక్కవు టెంపుల్, శ్రీ రాఘవాపురం టెంపుల్, శ్రీ సుబ్రమణ్య స్వామి టెంపుల్ మరియు కిజ్హక్కేక్కర శ్రీ కృష్ణ టెంపుల్ ఇక్కడ ప్రాచుర్యం పొందిన ఆలయాలు.

విశ్రాంతికి, ఆహ్లాదానికి అనువైన విస్తరించబడిన ఇసుక తీరంతో ఇక్కడి బీచ్ లు పర్యాటకులు తప్పక చూడాలనుకునే సందర్శన ప్రదేశాలు. పయ్యమ్బలం బీచ్, మీన్కున్ను బీచ్, కిజ్హున్న ఎజ్హర బీచ్ మరియు ముజ్హుప్పిలన్గడ్ బీచ్ లు ఈ ప్రాంతంలో ప్రాచుర్యం పొందినవి.

Please Wait while comments are loading...