కాసర్గోడ్ - విభిన్న సంస్కృతుల ప్రదేశం

కేరళ లోని ఉత్తర దిశలో చివరగా వున్నా కాసర్గోడ్ జిల్లా చాల మందికి చారిత్రక మరియు పురావస్తు అంశాల ఆసక్తి కలిగిస్తుంది. కేరళ ప్రదేశానికి అరబ్బులు 9వ మరియు 14వ శతాబ్దాలలో కాసర్గోడ్ ద్వారా వచ్చారని చెపుతారు. కాసర్గోడ్ లో కల బెకాల్ కోట ఒక విలువైన చారిత్రక చిహ్నం. దక్షిణ దిశగా అది నేరుగా సముద్రం లోకి వుంటుంది.

కాసార అంటే సంస్కృతి అని మరియు క్రోద అంటే భద్రత కల ఒక ధనాగారం అని చెపుతారు. కాసర్గోడ్ ప్రధానంగా కాసారక చెట్ల చే నిండి వుంటుంది. కనుక ఈ ప్రదేశానికి ఈ పేరు ఆ చెట్ల వలన కూడా వచ్చిందని చెప్పవచ్చు. ఈ చెట్ల తో పాటు సాథారణంగా కోస్తా తీరాలలో పెరిగే మరికొన్ని చెట్లు కూడా పెరుగుతాయి. కాసర్గోడ్ ప్రాంతం లో అధికంగా కొబ్బరి మరియు తాటి చెట్లు, కొండల మీద నుండి సముద్రంలోకి ప్రవహించే నీటి ప్రవాహాలు కనపడతాయి. ఏటవాలు రూఫ్ లు కల ఇండ్లు, అక్కడే తయారుచేయబడిన ఇటుకల ఇండ్లు కలిగి వుండటం ఈ టవున్ ప్రత్యేకత.

భిన్న సంస్కృతుల రూపం

కాసర్గోడ్ దాని విభిన్న సంస్క్రుతులకు నిలయంగా వుంటుంది. ఈ ప్రాంతం అక్కడ వారు పూజించే దేవత తెయ్యం ప్రీతిగా జరిగే కంబాల అనే ఎద్దు పందేలకు మరియు కోడి పందేలకు ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ క్రిస్తియన్లు, హిందువులు, మరియు ముస్లిం లు వుంటారు. అన్ని రకాల మత పర వేడుకలు జరుగుతున్నప్పటికీ పరమత సహనం కూడా అధికమే. మళయాళం, తులు, కన్నడ, కొంకణి మరియు తమిళం వంటి భాషలు మాట్లాడతారు.

వాతావరణం

దాని సంస్కృతి వలెనె కాసర్గోడ్ వాతావరణం కూడా రక రకాలుగా వుంటుంది. వేడి, అధిక తేమ, చల్లదనం, పోడితనం కలిగి ఉంటుంది. కూస్తా తీరం సమీపం లో నె ఉండటంతో శీతాకాలం నెలలు నవంబర్ నుండి జనవరి వరకు తప్పించి, మిగిలిన సమయం తేమ గా ఉంటుంది.

Please Wait while comments are loading...