Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాసర్గోడ్ » వాతావరణం

కాసర్గోడ్ వాతావరణం

ఉత్తమ సమయం కాసర్గోడ్ సందర్శనకు ఉత్తమ సమయం అంటే సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకూ అని చెప్పాలి. ఈ సమయంలో వాతావరణం చాల ఆహ్లాదంగా వుంటుంది. వేడి లేదా చలి వుండవు. సమానంగా వుండి పర్యటనకు అనుకూలం.

వేసవి

వేసవి కాసర్గోడ్ లో వేసవి వేడి అధికంగా ఉంటుంది. మార్చ్, మే నెలలలో ఉష్ణోగ్రతలు 20 నుండి 30 డిగ్రీ ల వరకూ మారుతూంటాయి. మే నెల అత్యధిక వేడి కలిగి ఉంటుంది. పర్యటన సూచించ దగినది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం నైరుతి రుతు పవనాల కారణంగా కాసర్గోడ్ లో అధిక వర్షాలు కురుస్తాయి. సగటు వర్షపాతం 3500 మీ.మీ. వర్షాకాలం జూన్ లో మొదలై ఆగష్టు చివరి వరకూ వుంటుంది. ఆగష్టు చివరి నాటికి వాతావరణం ఆహ్లాద కరంగా మారుతుంది.

చలికాలం

శీతాకాలం కాసర్గోడ్ లో శీతాకాలం డిసెంబర్ నుండి మార్చ్ వరకు ఉంటుంది. చలి అధికమే. ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల నుండి 25 డిగ్రీల వరకూ కొనసాగుతాయి. ఈ సమయంలో పర్యటన చాల అనుకూలంగా వుంటుంది.