Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తలాసేరీ

తలాసేరీ - సర్కస్ కేకులు, క్రికెట్

28

ఉత్తర కేరళలోని కన్నూర్ జిల్లాలోని తలాసేరీ గతిసీలమైన నగరాలలో ఒకటి. ఘనమైన గత చరిత్ర, మంత్రముగ్ధుల్ని చేసే అనడంతో తెలిచేర్రీ గా పిలువబడే ఈ నగరం మలబార్ తీర మకుటంలో కలికితురాయి లాంటిది. భారతదేశంలో ఈ చారిత్రిక నగరానికి సర్కస్లు, కేకులు క్రికెట్ కు పుట్టినిల్లుగా పేరొందింది.

1682 లో వ్యాపారం చేసే ఉద్దేశ్యంతో బ్రిటీష్ వారు తలచేరీలో ప్రవేశించారు. కోస్తా తీరానికి దగ్గరగా ఉండడంతో ఈ నగరం ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం అయింది. అనేక సాహిత్య రాజకీయ ఉద్యమాలకు జన్మస్థానంగా ఉన్న ఈ నగరం మలబార్ తీరానికి సంస్కృత రాజధానిగా పేరుబడింది. ఈ చైతన్యవంతమైన నగరం నుండే మొదటి మలయాళ వార్తా పత్రిక వెలువడింది.

చరిత్రతో తొణికిసలాడే నగరం ఇంగ్లీష్ చర్చ్, జాలర్ల దేవాలయం, ఓవర్ బర్రీస్ ఫాలీ, తలసేరీ ఫర్, జుమా మసీదు తలసేరీ లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలు. మొదటి మలయాళ ఆంగ్ల నిఘంటువు తాయారు చేసిన జర్మన్ దేశపు బిషప్ హెర్మన్ గండర్ట్ నివసించిన భవతి చరిత్ర ప్రేమికులకు ఆశక్తి గొలుపుతుంది. తలసేరీ కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ ఫ్రెంచ్ సెటిల్మెంట్ మాహే, చూడదగ్గ ప్రదేశాలలో ఒకటి.

వేలేస్లీ భవనం, రందత్తరా సినామేన్ ఎస్టేట్, కేథలిక్ రోసరీ చర్చ్, వామిల్ ఆలయం, ఉదయ్ పార్క్, ఉదయ్ కాలరీ సంఘం, ప్రభుత్వ భవనం, ఓడతిల్ పల్లి ఈ చారిత్రాత్మక పట్టణానికి వందలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. తలశేరీ నించి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములప్పిలాంగల్ బీచ్ ఏకైక డ్రైవ్ ఇన్ బీచ్.

కేకులు, బేకరీల పుట్టినిల్లు కావడం వల్ల తలసేరి లో ప్రత్యేకమైన వంటల సంస్కృతి వుంది. ఈ పట్టణంలో సాపేక్షంగా ఆహ్లాదకరమైన వాతావరణం వుంటుంది – రైల్, రోడ్డు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి వుంది. సంస్క్ర్తులు, ప్రకృతి, రుచులు, చరిత్రల కలగూరగంపను చూడలనుకునేవారికి ఇది సరైన వినోద విహార స్థలం.

తలాసేరీ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తలాసేరీ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తలాసేరీ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తలాసేరీ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా: తలసేరీ పట్టణానికి అన్ని ప్రధాన నగరాల నుండి రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించబడి ఉంది. కన్నూర్, కోజికోడ్, మంగలూర్, కోచి, మైసూర్, తిరువనంతపురం నుండి ప్రైవేట్ బస్సులే కాకుండా కేరళ రాష్ట్ర రవాణా బస్సులు కూడా నడుస్తాయి. బెంగుళూర్, చెన్నై వంటి సమీప మెట్రోపాలిటిన్ నగరాలకు కూడా తరచుగా బస్సులు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా కేరళలో ఉన్న, వెలుపల ఉన్న అనేక నగరాలకు తలసేరీ రైల్వే స్టేషన్ బాగా అనుసంధానించబడి ఉంది. కన్నూర్, కోచి, తిరువనంతపురం, కోజికోడ్, పాలక్కాడ్ వంటి నగరాలకు ఈ స్టేషన్ నుండి రోజువారీ రైళ్ళు ఉన్నాయి. మంగలూర్, బెంగళూర్, చెన్నై వంటి నగరాలకు తలసేరీ రైల్వే స్టేషన్ నుండి మంచి అనుసంధానం ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం ద్వారా కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం (కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం అని కూడా అంటారు) తలసేరీ కి సమీప విమానాశ్రయం. ఇది తలసరీ పట్టణం నుండి 93 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయం నుండి అన్ని ప్రథాన నగరాలకు, విదేశాల లోని కొన్ని నగరాలకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. విమానం దిగి తలసేరీ చేరుకోవాలంటే బస్సుల్లో, అద్దె టాక్సీలలో వెళ్ళవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Jun,Mon
Check Out
02 Jun,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue