కన్నూర్ నుంచి తలసేరి కి, తలసేరి నుంచి మహె కు వెళ్ళే కోస్తా తీరం వెంట వున్న అందమైన దేవాలయం జాలరుల దేవాలయం. దీని వ్యూహాత్మక స్థితి ఈ గుడిని ఒక అద్భుతమైన సందర్శక స్థలంగా చేస్తుంది. ఈ దేవాలయం నెలకొని వున్న పొడవాటి తీరాలు అందంగా ప్రశాంతంగా వుంటాయి.
జాలరుల జీవితాల్లో సముద్రం ఎంత ప్రధానమైనది అన్నదానికి ప్రతీకగా ఈ గుడి నిలుస్తుంది. ఈ గుడి గురించి అనేక జానపద ఐతిహ్యాలు ప్రచారంలో వున్నాయి. సముద్రుడికి తమ కృతజ్ఞతను తెలియచేయడానికి జాలరు ఈ దేవాలయం నిర్మించారని చెప్తారు.
ఈ గుడి పక్కనే ఇండియాలో మొదటి సారి క్రికెట్ ఆడిన స్టేడియం కూడా వుంది. తలసేరి నుంచ బస్సులు, రిక్షాల్లో జాలరుల దేవాలయానికి తేలికగా చేరుకోవచ్చు. ప్రకృతి అందాన్ని, దైవ సాన్నిధ్యంలో ప్రశాంతతను అనుభావి౦చాలనుకునే వారికి ఇది సరైన ప్రదేశం.