Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నిలంబూర్

నిలంబూర్ - టేకు చెట్ల పట్టణం !

26

టేక్ చెట్ల భూమిగా పిలవబడే నిలంబూర్ కేరళ లోని మలప్పురం జిల్లాలో ప్రధాన పట్టణం. విశాలమైన అడవులు, ప్రకృతి సౌందర్యం, ప్రత్యేక వన్య ప్రాణులు, అందమైన నీటి వనరులు, రాజ భవనాలు, చురుకైన గత వైభవం కల్గిన ఈ ప్రాంతానికి మలబార్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.

వ్యూహాత్మకంగా నెలకొన్న ఈ పట్టణానికి నీలగిరి కొండలు, ఎరనాడు, పాలక్కాడ్, కాలికట్ లు హద్దులుగా ఉన్నాయి. చలియార్ నది ఒడ్డున ఉన్న నిలంబూర్ లో ఆరోగ్యకరమైన పచ్చదనం, సారవంతమైన భూములు ఉన్నాయి. మంచి అనుసంధానాన్ని కల్గిన ఈ పట్టణానికి చేరడానికి మలప్పురం పట్టణం(40 కి.మీ.), కోజికోడ్ (72 కి.మీ.), త్రిస్సూర్ (120 కి.మీ.), గుడలూర్ (50 కి.మీ.) ఊటీ (100 కి.మీ.) వంటి అనేక పట్టణాలు, జిల్లాల నుండి రవాణా సౌకర్యం ఉంది.

ప్రత్యేక సంస్కృతి, విభిన్న కళారూపాలు

నిలంబూర్ కు ఉన్న ప్రత్యేక భౌగోళిక స్థితి వలన ఒక అసాధారణ సంస్కృతి ఉంది. బ్రిటిష్ వారికి ముందు పాలించిన రాజవంశం, మద్రాస్ ప్రెసిడెన్సీ క్రింది వచ్చిన పరిపాలన మార్పుల వలన ఈ పట్టణానికి విభిన్న సాంస్కృతిక లక్షణాలు వచ్చాయి. ఈ సుందరమైన పట్టణం నిలంబూర్ వేట్టిక్కోరు మకాన్ పాట్టు (నిలంబూర్ పాట్టుగా ఎంతో ప్రాముఖ్యత చెందింది) అనే కళారూపానికి ప్రసిద్ది చెందింది. ఈ కళారూపాన్ని ప్రతి ఏడు నిలంబూర్ కోవిలకం దేవాలయం వద్ద ప్రదర్శిస్తారు.

నిలంబూర్ కు కేరళ నిర్మాణశైలి సంపదలో కూడా భాగ౦ ఉంది. కోవిలకం పేరుతో ఈ పట్టణంలో అనేక రాజ ప్రాసాదాలు ఉన్నాయి. ఇవి గతకాలపు స్థానిక రాజులు, పాలకులు నివసించిన ప్రదేశాలు. నిలంబూర్ లోని కోవిలకములు వాటిలోని అద్భుతమైన కుడ్య చిత్రాలు, ఆశ్చర్యకరమైన చెక్క పనుల వలన ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షణను చూరగొన్నాయి.

విచిత్రమైన పుష్పాలు, పుష్కలమైన వృక్షాలు

ఎంతో పురాతనమైనది, ప్రపంచంలో ఎంతో ప్రసిద్ది చెందిన టేక్ వృక్ష సంపద కనిల్లిస్ ప్లాట్, నిలంబూర్ లో ఉంది. ప్రతి ఏడాది వేలాది మంది సందర్శకులను ఆకర్షించే భారతదేశపు మొట్టమొదటి టేక్ మ్యూజియం ఈ పట్టణంలో ఉంది. ఈ మ్యూజియం ప్రతి మొక్కల ప్రేమికుడు టేక్ వృక్షాన్ని గురించి తెల్సుకోదలచిన అన్ని విషయాలను సొంపుగా ప్రదర్శిస్తుంది.

నిలంబూర్ కు, నిలంబూర్ టేక్ ప్రిసేర్వ్ నందు ప్రపంచపు పొడవైన,అతి పెద్ద టేక్ వృక్షాన్ని కల్గి ఉన్న ప్రపంచ రికార్డ్ ఉంది. ఈ పట్టణం వెదురుకు కూడా ప్రసిద్ది చెందింది – ఇది దాని పేరుతో సంబంధం కల్గి ఉండటం అనేది ఒక వాస్తవం. ఈ పట్టణం పేరు రెండు పదాల నుండి పుట్టింది : నిలింబ (అంటే వెదురు) ఉర్ (ప్రదేశం)

విశాలమైన నిలంబూర్ అడవుల భాగాలు 3 వన్య ప్రాణి అభయారణ్యాలలో మూడు వేర్వేరు రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. కర్ణాటక లోని బందిపూర్ అభయారణ్యం, తమిళనాడు లోని ముత్తుమల అభయారణ్యం, కేరళ లోని వయనాడ్ అభయారణ్యం. టేక్ తో బాటుగా నిలంబూర్ అడవులలో విశాలమైన రోజ్ వుడ్, మహాగని, వెన్ టేక్ వృక్షాలు ఉన్నాయి.

ప్రకృతి ప్రేమికులకు నిజమైన ఆనందం

నిలంబూర్ లో చూడదగిన ప్రదేశాలు చాల ఉన్నాయి. కనోల్లీ ప్లాట్, టేక్ మ్యూజియం పట్టణంలో సందర్శకులు ఎక్కువగా చూసే ప్రదేశాలు. అడ్యన్ పర జలపాతాలు, వెల్లంతోడ్ జలపాతాలు కొండపై నుండి పడే కాలువలు, అందమైన పరిసరాలతో పర్యాటకులను ఆకర్షిస్తాయి. నిలంబూర్ కు దగ్గరగా ఉన్న నేదునయకం వర్షపు అడవులు, ఏనుగుల శిబిరాలు, కలప విశ్రాంతి గృహాలకు ప్రసిద్ది చెందింది. అక్కడి కుండల పనికి ప్రసిద్ది చెందిన చిన్న అరువకోడ్ గ్రామం పర్యాటకులను ఆకర్షిస్తుంది.

నిలంబూర్ లోని బయో రిసోర్సెస్ పార్క్ మరొక పర్యాటక హాట్ స్పాట్, దగ్గరలోని బట్టర్ ఫ్లై పార్క్ ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. సైలెంట్ వ్యాలి ప్రక్కనే ఉన్న న్యూ అమరంబాలం అభయారణ్య౦ అక్కడ ఉండే అరుదైన పక్షి జాతులకు ప్రసిద్ది చెందింది. వేత్తక్కోరుమకన్ దేవునికి చెందిన నిలంబూర్ కోవిలకం దేవాలయానికి ఏడాది పొడవున భక్తులు, సందర్శకులు విచ్చేస్తారు.

నిలంబూర్ లో పర్యాటకులు ప్రశాంత అందమైన పరిసరాలను చూసి తమ సమయాన్ని వినోదంగా గడపడానికి అనేక రిసార్ట్ లు, గృహ వసతులు ఉన్నాయి. నిలంబూర్ లోని రెస్టారెంట్లు నోరూరించే రుచికరమైన, సంప్రదాయ మలబార్ భోజనాన్ని అందిస్తున్నాయి. ఆహ్లాదమైన వాతావరణం, చక్కటి అనుసంధానంతో ఈ టేక్ పట్టణం వినోదించి, అన్వేషించేందుకు పర్యాటకులను రప్పిస్తుంది.

నిలంబూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నిలంబూర్ వాతావరణం

నిలంబూర్
31oC / 88oF
 • Sunny
 • Wind: WNW 7 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం నిలంబూర్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? నిలంబూర్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం నిలంబూర్ కు చక్కటి రోడ్డు సౌకర్యం ఉంది, బెంగళూరు, మైసూర్, సుల్తాన్ బతేరి, కోజికోడ్, త్రిస్సూర్, పాలక్కాడ్, కొట్టాయం నుండి నిలంబూర్ కు బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ పట్టణానికి కేరళ రాష్ట్ర రవాణా సంస్థ (కె ఎస్ ఆర్ టి సి) వారి బస్సులు నిరంతరం ఉంటాయి. నిలంబూర్ అన్ని పొరుగు ప్రాంతాలకు రోడ్డు ద్వారా అనుసంధానించ బడింది. ఈ ప్రాంతానికి చేరడానికి ప్రైవేటు బస్సులు కూడా పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం నిలంబూర్ రైలు స్టేషన్ నుండి పాలక్కాడ్, షోరనూర్, చెన్నై, కోచి వంటి కొన్ని స్థానాలకు రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. నిలంబూర్ కు దగ్గరగా ఉన్న రైలు స్టేషన్ షోరనూర్, నిలంబూర్ నుండి షోరనూర్ కు తరుచుగా రైళ్ళు ఉంటాయి. షోరనూర్ నుండి అన్ని ప్రధాన భారతదేశ నగరాలకు రైళ్ళు అందుబాటులో ఉన్నాయి.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  వాయు మార్గం కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం, నిలంబూర్ కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న దగ్గరి విమానాశ్రయం. కాలికట్ విమానాశ్రయం నుండి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు కొన్ని మధ్య ప్రాచ్య నగరాలకు చక్కటి అనుసంధానం ఉంది. వాయు మార్గాన వచ్చే వారికి విమానాశ్రయం నుండి 600 రూపాయలకు టాక్సీ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. విమానశ్రయం నుండి నిలంబూర్ చేరడానికి సుమారు 60 నిమిషాలు సమయం పడుతుంది.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Jul,Tue
Return On
24 Jul,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
23 Jul,Tue
Check Out
24 Jul,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
23 Jul,Tue
Return On
24 Jul,Wed
 • Today
  Nilambur
  31 OC
  88 OF
  UV Index: 8
  Sunny
 • Tomorrow
  Nilambur
  27 OC
  80 OF
  UV Index: 7
  Patchy rain possible
 • Day After
  Nilambur
  27 OC
  80 OF
  UV Index: 7
  Patchy rain possible