నేడు ప్రపంచంలో ఉన్న అతి పెద్ద టేక్ వృక్షాలలో ఒకటైన కన్నిమర టేక్, నిలంబూర్ లోని ప్రధాన సందర్సక ఆకర్షణ. ఈ చెట్టు 6.48 మీటర్ల చుట్టుకొలత ఉన్న కాండంతో ఒక బ్రహ్మాండమైన ఆకారాన్ని కల్గి ఉంది. 400ఏళ్ళ వయస్సు కల్గినదిగా అంచనా వేసిన ఈ కన్నిమర టేక్ కొనాగ్రపు ఎత్తు 48.75 మీటర్లు ఈ చెట్టు ఈ ప్రాంతంలో నివసించే గిరిజన తెగల విశ్వాస వ్యవస్థలో ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది, దీని గురించి అనేక కధలు కూడా ఉన్నాయి. అటువంటి ఒక కధను అనుసరించి, ప్రజలు దీనిని నరుకుతుండగా కాండం నుండి రక్తం చిమ్మింది. అప్పటి నుండి స్థానిక గిరిజనులు ఈ చెట్టును “కన్య చెట్టు” గా కొలిచే సంప్రదాయం నుండి దీనికా పేరు వచ్చింది. కన్నిమర అనే పేరు మలయాళపు రెండు పదాలు కన్ని (అర్ధం కన్య), మర (అర్ధం చెట్టు) ల కలయిక. పాలక్కాడ్ జిల్లలో ఉన్న పరంబికులం వన్యప్రాణి అభయారణ్యంలో ఈ సందర్శించదగిన చెట్టు ఉంది. నిలంబార్ పట్టణం నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ abhaya అభయారణ్యానికి రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. భారత ప్రభుత్వము ఈ చెట్టును ‘మహావృక్ష పురస్కారం’ తో సత్కరించింది.