కొల్లాం కి 8 కి.మి. దూరం లో ఉన్న నీండకర పోర్ట్ ప్రధానమైన ఓడ రేవు పట్టణం మరియు మత్స్య కేంద్రం. ఇండో-నార్వే మత్స్యకారుల ప్రాజెక్టు ప్రధాన కేంద్రం గా ఉండటం వల్ల ఈ ప్రదేశం చేపలు పట్టడం తదితర సముద్ర కార్యకలాపాలన్నింటికీ వెన్నముక గా భావించబడుతూ ఉంది.
ఈ ప్రాజెక్ట్ కారణంగా చేపలుపట్టడం లో సాధించిన ఇతోధికమైన అభివృద్ది ఈ ప్రాంత అభివృద్దికి తోడ్పడింది. మత్స్యకారుల శిక్షణ సంస్థ ఏర్పాటు చేయడం, శక్తికులంగర వద్ద పడవ నిర్మాణ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం తో పాటు, శీతలపరచడానికి రెఫ్రిజిరేషన్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం వంటి కార్యకలాపాల్ని ఈ ప్రాజెక్ట్ చేపట్టింది.
దాదాపు 500 ఫిషింగ్ బోట్ ల సామర్థ్యం గల ఈ పోర్ట్ ఈ ప్రాంతం లోని అతి పెద్ద పోర్ట్ ల లో ఒకటి. పోర్ట్ ప్రాంతం నుంచి ఆ పరిసరాల్ని చూడటం ఎంతో మనోహరంగా ఉంటుంది. పోర్ట్ ని ఆనుకుని ఉన్న బ్రిడ్జి పైనుంచి అష్టముడి సరస్సు సముద్రం లో కలవడం చూడటం చాలా రమణీయంగా ఉంటుంది.