కొల్లాం కి 30 కి.మి. దూరం లోని వల్లికావు ప్రాంతం లో ఏర్పడ్డ మత పరమైన యాత్రాకేంద్రం అమృతపురి. మాతా అమృతానందమయి జన్మ స్థలమైన వల్లికావు అనేది మత్స్యకారుల తో నిండిన ఒక చిన్న అందమైన గ్రామం. మాతా అమృతానందమయి ఆశ్రమం ఏర్పడ్డాక ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు పొందింది.
మాతా అమృతానందమయి కి ప్రపంచవ్యప్ప్తంగా లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు. కొల్లాం కి, అమృతపురి కి మధ్య పడవ ప్రయాణం చేస్తూ సందర్శకులు జల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు.
ఈ ప్రాంతానికి రావడానికి కొచ్చి, తిరువనంతపురం ల నుంచి బస్సు సౌకర్యం ఉంది. మాతా అమృతానందమయి పేరు మీద ఏర్పడ్డ అమృతపురి క్యాంపస్ లో విద్యా సంస్థలు, రీసెర్చ్ కేంద్రాలు, ఛారిటీ హాస్పిటల్, పోస్టాఫీస్, కేంటీన్, బుక్ షాప్ తదితర సౌకర్యాలు కలిగి కొన్ని ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది.