Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మరారికులం » వాతావరణం

మరారికులం వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం మరారికులం గ్రామానికి సంవత్సరంలో ఎపుడైనా సందర్శించవచ్చు. అయితే, వేసవి మరియు వర్షాకాలంలో తప్ప శీతాకాలమైన సెప్టెంబర్ నుండి మార్చి వరకు గల సమయం సూచించవచ్చు.

వేసవి

వేసవి మరారికులం వాతావరణం ఒక మోస్తరు వేడిగా ఉంటుంది. కోస్తా గ్రామం కావటం వలన వాతావరణం లో తేమ అధికం. వేసవి మార్చిలో మొదలై మే నెల చివరి వరకు ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలనుండి 36 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మారుతూంటాయి.

వర్షాకాలం

 వర్షాకాలం కేరళలోని కోస్తా తీర ప్రదేశాలలో వలెనే ఇక్కడ కూడా వర్షాలు అధికమే. నైరుతి మరియు ఈశాన్య రుతుపవనాల కారణంగా వర్షాలు పడతాయి. వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ మొదటి వారం వరకు కొనసాగుతుంది.  

చలికాలం

శీతాకాలం మరారి కులంలో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. శీతాకాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి చివరి వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలనుండి 32 డిగ్రీ సెంటీ గ్రేడ్ వరకు మారుతూంటాయి.