కూచిపూడి - సంస్కృతి మరియు సంప్రదాయాల గ్రామం

భారత దేశ దక్షిణాది రాష్ట్రాల లో ఒకటైన ఆంధ్రప్రదేశ్   లోని కృష్ణ జిల్లాలో మొవ్వ మండలం లో కూచిపూడి ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం బంగాళా ఖాతానికి చాలా దగ్గ్గరగా వుంటుంది. కృష్ణా నది కి సమీపం లో కలదు. సాంప్రదాయ  నాట్యం అయిన కూచిపూడి నాట్యం ఈ ప్రదేశం నుండే పుట్టింది. అందుకనే ఈ నాట్యానికి కూచిపూడి అని పేరు పెట్టారు.

కూచిపూడి గ్రామం మొవ్వ మండలానికి సుమారు 6.4 కి. మీ.ల దూరం లోను, మరియు మచిలీపట్టణం కు సుమారు 25.6 కి. మీ. ల దూరం లోను కలదు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ కు సుమారు 325 కి. మీ.ల దూరం కలదు.

కూచిపూడి కి సమీపంలో కొన్ని పర్యాటక ప్రదేశాలు కలవు. అవి ప్రధానంగా, విజయవాడ, కోనసీమ, గుంటూరు మరియు అమరావతి గా చెప్పవచ్చు. ఈ ప్రదేశాలు చూచే పర్యాటకులు కూచి పూడి నాట్యం కారణంగా కూచిపూడి తప్పక చూస్తారు. గత కాలపు సాంప్రదాయాలు, నాట్యాలు కోరే వారికి కూచిపూడి గ్రామం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కూచిపూడి కి దగ్గరలో ఉండవల్లి గుహలు, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్, మొగల్రాజపురం గుహలు, కనక దుర్గ టెంపుల్ కలవు.

దురదృష్టవశాత్తూ, ఈ గ్రామానికి రైల్వే స్టేషన్ లేదు. సమీప రైలు స్టేషన్ మరియు సమీప ఎయిర్ పోర్ట్ విజయవాడ లో కలవు. అయితే, ఈ గ్రామానికి మంచి రోడ్లు కలవు. కూచిపూడి రావాలంటే, హైదరాబాద్ లేదా విజయవాడ ల మీదుగా రావచ్చు. కూచిపూడి ఉష్ణమండల వావరణం కలిగి, వేసవులు వేడిగా శీతాకాలాలు ఒక మోస్తరు చలితోను ఉంటాయి. వర్షాకాలం లో ఒక మోస్తరు వర్షాలు పడతాయి.

 

Please Wait while comments are loading...