ఈశాన్య భారత దేశం లో ని అరణ్యాలను సందర్శించాలని అనుకునే వారికి సరి అయిన ప్రదేశం ఖాంగ్లంగ్ వైల్డ్ లైఫ్ సాంచురీ. మిజోరాం లో ని ఐజావల్ నుండి దాదాపు 170 కిలో మీటర్ల దూరం లో ఈ సాంచురీ ఉంది.
పచ్చటి కొండలతో అలాగే శిఖరాలతో కప్పబడి ఉన్న ఈ ప్రాంతం దాదాపు 35 చదరపు అడుగుల మేరకు విస్తరించబడి ఉంది. 1300 మీటర్ల ఎత్తులో ఈ ప్రాంతం ఉంది. ఖాంగ్లంగ్ వైల్డ్ లైఫ్ సాంచురీ వివిధ రకాల వన్య మృగాలకు స్థావరం వంటిది. సెరో, బార్కింగ్ డీర్, గిబ్బన్, వైల్డ్ బోర్, సంబా డీర్, హూలోక్ మరియు చిరుతల వంటివి ఇక్కడ సాధారణంగా కనపడే జంతువులు. వీటితో పాటు ఈ సాంచురీ లో ని ప్రకృతి సౌందర్యం పర్యాటకులని సమ్మోహనపరుస్తుంది.
ఇక్కడ రెండు మూడు రోజులు గడపాలనుకునే పర్యాటకులకు లుంగ్లీ లో ఉన్న అల్ల్బస్టా హోటల్ చక్కటి అవకాశం. ఐజ్వాల్ నుండి టూరిస్ట్ వెహికల్ ని అద్దెకి తీసుకోవడం ఖాంగ్లంగ్ వైల్డ్ లైఫ్ సాంచురీ చేరుకునేందుకు ఉత్తమ మార్గం