Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మహాబలేశ్వర్ » వాతావరణం

మహాబలేశ్వర్ వాతావరణం

సందర్శనకు మంచి సమయం ఏది? మహాబలేశ్వర్ లో సంవత్సరం పొడవునా ఒక మోస్తరు వాతావరణం మాత్రమే ఉంటుంది. చలికాలం లేదా వర్షాకాలం మహాబలేశ్వర్ సందర్శనకు అనుకూలంగా ఉంటుంది.

వేసవి

వేసవి వేసవి కాలం ఈ ప్రదేశంలో మార్చి నుండి జూన్ వరకు ఉండి సైట్ సీయింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలనుండి 29 డిగ్రీల వరకు మారుతూంటాయి. వేసవి వేడి అధికంగా ఉన్నప్పటికి సుమారు 4,400 అడుగుల ఎత్తున కల మహాబలేశ్వర్ లో వేడి అనిపించకుండా చల్లని గాలులు కూడా అధికంగానే వీస్తూంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ కాలంలో ఈ ప్రాంత అందాలు పర్యాటకులను విస్మయ పరుస్తాయి. జంటల హనీమూన్ ఈ సమయంలో ఎంతో అధికంగా ఉంటుంది. అనేకమంది నూతన వధూవరులు హనీమూన్ కొరకు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.

చలికాలం

చలికాలం చలికాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి నెల వరకు కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలనుండి 24 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మారుతూంటాయి. సమీపంలోని ప్రధాన నగరాలనుండి ఈ హిల్ స్టేషన్ కు క్రిస్టమస్ లేదా నూతన సంవత్సర వేడుకలలో పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తారు.