పర్యటనకు ఉత్తమ సమయం మహాబలిపురం సందర్శనకు నవంబర్ నుండి ఫిబ్రవరి వరకూ అనుకూలం. ఈ సమయంలో మహాబలిపురం పూర్తిగా సందర్శించవచ్చు.
వేసవి సాధారణంగా వేసవి ఇక్కడ అధిక వేడిగా వుంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా వుంటుంది. సముద్రపు గాలులు కొంతమేరకు చల్లదనాన్ని ఇస్తాయి. వేసవిలో పర్యటన సూచించ దగినది కాదు.
వర్షాకాలం వర్షాకాలంలో గాలిలో తేమ అధికంగా వుండి అధిక చెమటలు పడతాయి. ఉష్ణోగ్రత సుమారు 25 డిగ్రీలు గా వుంటుంది. వర్షాలు తక్కువే. అయినప్పటికీ కొన్నిమార్లు అధిక వర్షంపడుతుంది. కనుక పర్యాటకులు ఈ సమయంలో ఒక గొడుగు లేదా రైన్ కోట్ తీసుకు వెళ్ళటం మంచిది.
శీతాకాలంలో పగలు ఆహ్లాదం గాను రాత్రులందు చల్లగాను వుంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలు గా వుండి పర్యటనకు అనుకూలం.