Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మనికరన్ » వాతావరణం

మనికరన్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం : మణికరణ్ చూడాలనుకునే యాత్రికులు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఈ ప్రాంతాన్ని సందర్శించడం మంచిది.

వేసవి

మణికరణ్ లో ఒక మోస్తరు చల్లటి వాతావరణం వుంటుంది, కాబట్టి యాత్రికులు ఇక్కడికి వెచ్చగా వుండే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఇక్కడికి వచ్చేలా ప్రణాళిక చేయవచ్చు.వేసవి (ఏప్రిల్ నుంచి జూన్) : మణికరణ్ లో వేసవి ఏప్రిల్ లో మొదలై జూన్ దాకా వుంటుంది. ఆ సమయంలో ఇక్కడి గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 16 డిగ్రీలు, 6 డిగ్రీలు వుంటాయి.  

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుంచి సెప్టెంబర్) : ఇక్కడ వర్షాకాలం జూలై నుంచి సెప్టెంబర్ వరకు వుంటుంది. ఏడాది పొడవునా ఒక మాదిరి వర్షపాతం నమోదైనప్పటికీ, వర్షాకాలం లో గరిష్ట వర్షపాతం నమోదౌతుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత 8 డిగ్రీల వద్ద తారాడుతుంది.  

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుంచి మార్చ్) : మణికరణ్ లో శీతాకాలం నవంబర్ లో మొదలై మార్చ్ దాకా వుంటుంది. హిమాచల్ ప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే, మణికరణ్ లో ఈ కాలంలో కనిష్టంగా -8డిగ్రీల నుంచి గరిష్టంగా 3 డిగ్రీల మధ్య వుండే ఉష్నోగ్రతలతో చల్లటి వాతావరణం ఉంటుంది.