Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మంత్రాలయం » వాతావరణం

మంత్రాలయం వాతావరణం

అత్యుత్తమ కాలం మంత్రాలయం సందర్శించటానికి అక్టోబర్ ఫిబ్రవరి నెలల మధ్య కాలం అత్యుత్తమం. ఈ సమయంలోని ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ మించక పోవటం వల్ల వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. శీతాకాలపు ఎండ మరీ వేడిగా కాకుండా వెచ్చగా ఉండి, ప్రయాణాలకి  బయట ప్రదేశాలు చూడటానికి అనువుగా ఉంటుంది.

వేసవి

వేసవి కాలం:మంత్రాలయం లోని వేసవి విపరీతమైన వేడిగా, పొడిగా ఉంటుంది. తీవ్రమైన ఎండ వల్ల ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ దాకా చేరుకుంటాయి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ మరియు జూలై నెలలు వేసవి కాలం. వేసవిలోని తీవ్రమైన ఎండ ఈ ప్రాంతాన్ని పొడిగా, తేమగా తయారుచేస్తుంది. ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించకపోవటమే మంచిది.

వర్షాకాలం

వర్షా కాలం:జూలై లో మొదలయ్యే వర్షా కాలం ఆగష్టు, సెప్టెంబర్ దాకా కొనసాగుతుంది. అక్టోబర్, నవంబర్ నెలలలో కూడా చెదురుమదురు జల్లులు కురుస్తాయి. వానల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గినా 32 డిగ్రీల సెల్సియస్ కి తగ్గవు. వర్షా కాలం లో తేమ స్థాయి పెరుగుతుంది. ఈ ప్రాంతంలో మితమైన వర్షపాతం నమోదవుతుంది.

చలికాలం

శీతాకాలం:నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు శీతాకాలం. డిసెంబర్, జనవరి అత్యంత చల్లగా ఉంటాయి. అయితే శీతాకాలం మరీ విపరీతమైన చలి అయితే ఉండదు. ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గవు. అందువల్ల శీతాకాలం కాస్త తేలిక గా ఉంటుంది. వేడిగా ఉండదు. మధ్యాహ్నాలు ఆహ్లాదంగా, సాయంత్రాలు చల్లగా ఉంటాయి.